పందెం ఖాయమా ?

Cock fight will organize or not

01:16 PM ON 13th January, 2016 By Mirchi Vilas

Cock fight will organize or not

కోడి పందాల నియంత్రణ కు చర్యలు తీసుకుంటామని హైకోర్టు కి ఎపి ప్రభుత్వం హామీ ఇవ్వగా, మరోవైపు పందెం కోసం నిర్వాహకులు సర్వం సిద్దం చేసుకుని కూర్చున్నారట. ప్రభుత్వం పై వత్తిడి పెంచడం ద్వారా ఎలాగైనా పందెం జరిగేలా చేయాలని ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. పండుగ రోజులు వచ్చేయడంతో ఇక ప్రజా ప్రతినిధులు రంగంలో దిగారు.
ఇందులో భాగంగా తమిళనాడులో జల్లికట్టు తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందేలను సంప్రదాయ క్రీడగా పరిగణించాలని పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, బిజెపి నేత రఘురామకృష్ణంరాజు, ప్రజా సంఘాల ప్రతినిధులు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఉపేంద్రమిశ్రాకు లేఖ రాసారు.
నేతలంతా ఇవాళ హోంశాఖ కార్యదర్శిని స్వయంగా కలిసి మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. తమిళనాడులో జల్లికట్టును సంప్రదాయ క్రీడగా గుర్తిస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ జారీ చ్జేయనుంది. అదే ఆర్డినెన్స్‌లో కోడిపందేలను కూడా చేర్చాలని ఉభయగోదావరి జిల్లాల నేతలు కోరుతున్నారు. మొత్తానికి కోడి పందాలకు అనువైన వాతావరణం రూపుదిద్దుకుంటోంది.
ఒకవేళ కేంద్రం నుంచి ఆదేశాలు రాకున్నా, చూసి చూడనట్లు వ్యవహరించాలని ఎపి ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చే అవకాశం వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary

Cock fight will organize or not