తెలుగు రాష్ట్రాల మధ్య రేయింబవళ్లు కోడిపందాలు

Cockfights between two states continously

12:22 PM ON 17th January, 2017 By Mirchi Vilas

Cockfights between two states continously

సంక్రాంతి అనగానే ఎన్ని ఆంక్షలు పెట్టినా కోడిపందాలు, జల్లి కట్టు వంటివి సాగడం సహజం. అందుకే ఆంక్షలు పనిచేయకుండా పోయాయి. ఇక పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఇంకేముంది.. ఎప్పటిలాగే ఈ ఏడాది సంక్రాంతి కూడా కోడి పందేలతో భలే రంజుగా సాగిపోయింది. పగలు రాత్రి అన్న తేడా లేకుండా.. రేయింబవళ్లు కోడిపందేలు జరిగిన తీరు జాతర వాతావరణాన్ని తలపించిందనే చెప్పాలి. నోట్ల రద్దు ఎఫెక్ట్ ఉంటుందని తొలినుంచి భావించినా.. అలాంటిదేమి మచ్చుకు కూడా కనిపించలేదు. కొత్త నోట్ల ధగధగలతో పందెం రాయుళ్లు బరిలోకి దిగారు. ఒక్క ఆంధ్రా మాత్రమేనా? తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కోడి పందేల కోసం తరలి వచ్చారు.

1/5 Pages

ప్రజా ప్రతినిధులే కీలకం...

ముఖ్యంగా చాలాచోట్ల ప్రజాప్రతినిధులే ముందుండి కోడి పందేలను నిర్వహించడంతో బందోబస్తులో ఉన్న పోలీసులంతా ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఉభయగోదావరి జిల్లాల్లోనే సుమారు రూ.150 నుంచి 200 కోట్ల పందేలు జరిగి ఉంటాయని అంచనా. కోడిపందేలతో పాటు పేకాట, గుండాటలు కూడా జోరుగా జరిగాయి.

English summary

This Sankrathi gave a new energy to cockfights.every one thought this year the speed this cockfights will decrease due to currency problems,But this did not stopped the betting.