మెదడులోకి దూరిన బొద్దింక ... మరి ఏమైంది ?

Cockroach in women brain

12:03 PM ON 3rd February, 2017 By Mirchi Vilas

Cockroach in women brain

సాధారణంగా చీమలు వంటి చిన్న జీవ రాశులు పొరపాటున మన శరీరంలోకి దూరే అవకాశం వుంది. కానీ బొద్దింక మన శరీరంలో చేరితే, ఆమ్మో చూడ్డానికే భయం వేసే బొద్దింక శరీరంలో ఉంటే ఇంక ఏమైనా ఉందా? కానీ, ఓ మహిళ శరీరంలోకి బొద్దింక దూరింది. అవును, ముక్కులో నుంచి మెదడు భాగంలోకి దూరిన బొద్దింకను చెన్నై స్టాన్లీ ఆస్పత్రి వైద్యులు బయటకు తీశారు. ఈ అరుదైన ఘటన వివరాల్లోకి వెళ్తే, చెన్నైలోని ఈంజంబాక్కంలో గౌరియమ్మన్ ఆలయ వీధికి చెందిన మునుస్వామి భార్య సెల్వి (42). జనవరి 31వ తేదీన రాత్రి నిద్రపోతుండగా ఆమె ముక్కులోకి బొద్దింక దూరింది. దీంతో తీవ్ర ఇబ్బంది పడినా.... బొద్దింక దూరినట్టు మాత్రం గ్రహించలేదు. బుధవారం సమీపంలోని ఆస్పత్రికి వెళ్లగా ముక్కులో కండలు పెరిగి ఉండొచ్చని పేర్కొంటూ మందులు ఇచ్చి పంపించేశారు. ఇంటికి వచ్చి మందులు వాడినా బాధ తగ్గకపోవడంతో సమీపంలోని మరో ఆస్పత్రికి వెళ్లగా అక్కడ స్కానింగ్ చేసి మెదడు భాగంలో బొద్దింక ఉన్నట్టు చెప్పారు. దానిని బయటకు తీసే సాంకేతిక పరిజ్ఞానం తమ ఆస్పత్రిలో లేదని తెలిపారు. ఆమె స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిని ఆశ్రయించారు. ఈఎన్ టీ వైద్య నిపుణులు శంకర్ , ముత్తుచిత్ర తదితరులు ఆ బొద్దింక ప్రాణంతో ఉన్నట్టు గుర్తించారు. తర్వాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరం ద్వారా గురువారం బొద్దింకను బయటకు తీశారు.

ఇది కూడా చూడండి: ఇక నుంచి అంత్యక్రియలు కూడా లైవ్ లో చూడొచ్చు

ఇది కూడా చూడండి: రాత్రిళ్ళు అక్కడికి వెళ్తే, తిరిగిరావడం కష్టమట ... అయితే అక్కడేం వున్నాయి (వీడియో)

English summary

cockroach went to women's brain through nose doctors done operation and took it away.