ఇక రాబోయేవి బొద్దింక పాలు?

Cockroach milk could be available in future

11:25 AM ON 24th January, 2017 By Mirchi Vilas

Cockroach milk could be available in future

ఆవు పాలు , గేదె పాలు, గొర్రె పాలు , మేక పాలు తెలుసు. కొందరు ఈమధ్య గాడిద పాలు కూడా తాగుతున్నారు. ఎందుకంటే ఆరోగ్యం కోసం. అయితే బొద్దింక క్షీరదం కాదు. కానీ బొద్దింకలు నుంచి పాలు రాబోతున్నాయట. ఎలాగంటే, వరి, సోయా బీన్స్, హెంప్ ల నుంచి పాల వంటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లే... బొద్దింక నుంచి కూడా పాలను తీయగలిగితే..! అది భవిష్యత్తులోని కొన్ని ఆహార అవసరాలు తీరుస్తుందనే ఆశతో పరిశోధకులు ఉన్నారు. ‘పసిఫిక్ బీటిల్ కాక్రోచ్’ (డిప్లోప్టెరా పంక్టేటా) అనే బొద్దింకలలో ఒక ప్రజాతి అయిన దీని నుంచి పాల నుంచి సేకరించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. తన పిల్లలకు జన్మనిచ్చాక, వాటిని సాకడం కోసం ఇది పాలవంటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి ఈ ప్రజాతికి చెందిన బొద్దింకలు. ఆ ద్రవంలో చక్కెర, కొవ్వులు, ప్రొటీన్లు, అమైనో యాసిడ్స్ వంటివి ఎక్కువని తేలింది.

బొద్దింకల నుంచి లభ్యమయ్యే క్యాలరీలు కూడా ఎక్కువే. దాంతో ఈ తరహా ఆహారం (న్యూట్రిషన్) కోసం పరిశోధనలు సాగుతున్నాయి. ఇదే విషయం ఐయూసీఆర్ జే అనే జర్నల్ లో ప్రచురితం అయ్యింది. బొద్దింకల నుంచి పాల సేకరణ అనేది ఇప్పుడు సేకరిస్తున్న పాల (డెయిరీ) ఉత్పాదనలా జరగడానికి ఆస్కారం లేదు. ఆ ద్రవంలోని రసాయనాల సమ్మేళనాలను పరిశీలించి, ఆ కెమికల్ కాంపౌండ్ లనే మళ్లీ పరిశోధనశాలలో కృత్రిమంగా ఉత్పత్తి చేయాలనీ, ఆ ఫార్ములా తెలిశాక పులియడానికి ఉపయోగపడే ‘ఈస్ట్’జీవులను ఇప్పుడు సృష్టిస్తున్నట్లుగానే బయో ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయాలన్నది శాస్త్రవేత్తల ఆలోచన. ఇది ఒక ఎత్తయితే ఆ ఉత్పాదనను ప్రజలు స్వాగతించి ఆదరిస్తారా లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి: ఇండియన్ మార్కెట్లో ఇప్పటి వరకు ఇలాంటి ఫోనే లేదట

ఇవి కూడా చదవండి: ఇవి తింటే అన్నిరకాలుగా పుష్టిగా ఉంటారట

English summary

Scientists have been discovered a new milk which was going to be made by Cockroach. They made some experiments on cockroaches and found that cockroaches will be useful to produce milk in future needs.