నెల్లూరు జిల్లాలో కుండపోతగా వర్షాలు

Cold Flooded Rains in Nellore

06:26 PM ON 17th November, 2015 By Mirchi Vilas

Cold Flooded Rains in Nellore

తుఫాన్‌ కారణంగా నెల్లూరు జిల్లాలో కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సైదాపురం మండలం, కైవల్య నది దగ్గర వరదనీటిలో వ్యాన్‌ చిక్కుకుంది. వ్యాన్‌ఫైన ముగ్గురు బాధితులు ఉండిపోవడంతో రక్షణ చర్యలు చేపట్టారు. కోవూరు మండలం జంగం వీధిలో రైసుమిల్లు గోడ కూలి బాలుడు మృతి చెందాడు. తల్లితండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. పొదలకూరు మండలం మహ్మదాపూర్‌లో చలిగాలులకు వృద్ధురాలు మృతి చెందారు. గూడూరఱు పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. తీరప్రాంతాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. గూడూరులో పలు ఇళ్లలోకి వరదనీరు రావడంతో ప్రజలు ఇళ్ళపైకి చేరి, తమను రక్షించాలని ఆర్తనాదాలు చేశారు. మొత్తానికి భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా అతలాకుతలం అయ్యింది.

English summary

Cyclone effect : Heavy rain lashes in Nellore District