ఐష్-అభిషేక్ మధ్య కోల్డ్ వార్.. సల్మానే కారణమా?

Cold war between Aishwarya Rai and Abhishek Bachchan

01:24 PM ON 5th October, 2016 By Mirchi Vilas

Cold war between Aishwarya Rai and Abhishek Bachchan

అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అంటూ ఓ సినీ కవి ఎప్పుడో చెప్పాడు. సరిగ్గా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ల మధ్య అదే తంతు నడుస్తోందని అంటున్నారు. వివేక్ ఒబేరాయ్, సల్మాన్ ఖాన్ వంటి హీరోలతో ప్రేమాయణాలు నడిపి చివరకు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటి కోడలైంది ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్. అభిషేక్ భార్యగా ఓ పెద్దింటి కోడలిగా మారిపోయిన ఐష్ ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. అయితే ఇప్పుడు ఐశ్వర్య ప్రవర్తన చూస్తుంటే, ఆమె వైవాహిక జీవితంలో ఏవో లుకలుకలు మొదలైనట్టు అనుమానం వస్తోంది. ఈ మధ్య కాలంలో ఐశ్వర్య కుటుంబ జీవితం కంటే ప్రొఫెషనల్ లైఫ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనబడుతోంది.

'యే దిల్ హై ముష్కిల్' చిత్రంలో రణ్ బీర్ కపూర్ తో శృంగార సన్నివేశాల్లో నటించడం అమితాబ్ కు కోపం తెప్పించినట్టు వార్తలు రావడం తెల్సిందే. అంతకుముందు నుంచే అత్తగారు జయా బచ్చన్ తో ఐష్ కోల్డ్ వార్ నడుపుతున్నట్టు సమాచారం. మరో హాట్ న్యూస్ ఏమిటంటే, ఐశ్వర్య తన మాజీ ప్రియుడు సల్మాన్ కు దగ్గరగా జరుగుతుండడమే ఇందుకు కారణం అనిపిస్తోందని టాక్. నిజానికి ఇంతకుముందు బచ్చన్ కుటుంబానికి సల్మాన్ అత్యంత ఆప్తుడు. అయితే ఐశ్వర్య రాకతో అమితాబ్ కుటుంబం సల్మాన్ ను దూరం చేసుకుంది. అలాంటిది ఇప్పుడు అతని సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఐశ్వర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఐశ్వర్య తీసుకున్న ఈ నిర్ణయం ఆమె వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని బాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు విడుదల కాబోతున్న సినిమాలన్నింటి గురించి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసే అమితాబ్, తన కోడలు నటించిన యే దిల్.. సినిమా గురించి మాత్రం పట్టించుకోలేదు. ఇవన్నీ చూస్తుంటే ఐష్, అభిషేక్ మధ్య ఏదో జరగకూడనిది జరుగుతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. బంధానికి బీటలు పడుతున్నాయని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

English summary

Cold war between Aishwarya Rai and Abhishek Bachchan