నాగ్-బాలయ్య మధ్య వైరం ఇంకా చల్లారలేదా?

Cold war between Nagarjuna and BalaKrishna

04:30 PM ON 26th April, 2016 By Mirchi Vilas

Cold war between Nagarjuna and BalaKrishna

టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరంటే ముందుగా వినిపించే పేర్లు వీరే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ప్రస్తుతం పరిశ్రమలో వీరి తర్వాతి తరం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు ఎంత మంది వచ్చినా.. ఈ నలుగురికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 100వ సినిమాకు చేరుకున్నారు. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలయ్య ఇందుకోసం 'గౌతమీపుత్ర శాతకర్ణి' కథను ఎంచుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇది కూడా చదవండి: పవన్ మూడో భార్య గురించి తెలీని నిజాలు..

ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. చిరంజీవి, వెంకటేష్, మరియు ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. కానీ నాగార్జున ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య గతంలో కొన్ని విబేధాలు ఉండేవి. ఇద్దరి మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ నడుస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ కారణంగానే నాగార్జున హాజరు కాలేదని అనుమానిస్తున్నారు. ఒకప్పుడు బాలయ్య, నాగార్జున మధ్య సంబంధాలు బావుండేవి. సినిమాల పరంగా పోటీ ఉన్నా కూడా మంచి అనుబంధం ఉండేది, ఉన్నట్టుండి ఏమైందో ఏమో గానీ రెండు మూడేళ్ళ నుండి వీరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది.

ఇది కూడా చదవండి: ప్రభాస్ పెళ్ళి అమెతోనేనట

తన అన్నపూర్ణ స్టూడియోలో కార్యక్రమం జరిగుతున్నా.... నాగార్జున ఆ రోజు హైదరాబాద్ లోనే ఉన్నా.. ఎందుకు రాలేదు? నాగార్జునకు బాలయ్య చెప్పలేదా? లేకుంటే చెప్పినా రాలేదా? అని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. వీరి మధ్య విబేధాలు ఏమిటి? సినిమాల విడుదల సమయంలో ఇద్దరి మధ్య గతంలో కొన్ని విబేధాలు వచ్చాయి. ఓ సారి బాలయ్య సినిమా నడుస్తుండగా బలవంతంగా తీయించేసి నాగార్జున సినిమా వేసారు. ఆ సమయంలో బాలయ్య ఆందోళన కూడా చెందారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విబేధాలు చిన్నగా మొదలై... తర్వాత కోల్డ్ వార్ స్టాయికి వెళ్లాయనేది టాక్.

ఇది కూడా చదవండి: క్లాస్ రూంలో టీచర్ ను చితకబాదిన విద్యార్థులు(వీడియో)

ఆ మధ్య నాగార్జున తనయుడు అఖిల్ సినిమా ప్లాప్ అయిన సమయంలో కూడా బాలయ్య కామెంట్స్ వీరి మధ్య హీట్ మరింత పెంచాయని అంటున్నారు. మోక్షజ్ఞ తొలి సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చేలా ఉండాలి, అలాంటి కథల కోసమే ఎదురు చూస్తున్నారు. ముందు మామూలు సినిమాలతో ప్రేక్షకుల అభిమానం చూరగొంటే... మాస్ ఫాలోయింగ్ అదే వస్తుంది అన్నారు బాలయ్య. నా కొడుకు తొలి సినిమాకే ప్రపంచాన్ని కాపాడేసాడు లాంటి పాత్రలు వద్దు అని బాలయ్య కామెంట్ చేసారు. ఇటీవల విడుదలై అఖిల్ సినిమాను ఉద్దేశించే బాలయ్య ఆ కామెంట్స్ చేసారనే ప్రచారం జరిగింది.

ఇది కూడా చదవండి: టాప్ లెస్ సెల్ఫీతో ఉద్యోగం పోయింది.. కానీ ఇప్పుడు సూపర్ ఆఫర్ కొట్టేసింది

English summary

Cold war between Nagarjuna and BalaKrishna. Cold war between Akkineni Nagarjuna and Nandamuri Balakrishna.