గౌతమితో విబేధాలు 'శృతి' మించాయి?

Cold War Between Shruti Haasan and Gautami

10:55 AM ON 8th July, 2016 By Mirchi Vilas

Cold War Between Shruti Haasan and Gautami

ప్రస్తుత పరిస్థితులు గమనించిన వారెవరైనా పాపం కమల హాసన్ అని అనిపించడం సహజం. ఇంతకీ విషయం ఏమంటే, ఏదైనా ఫంక్షన్స్ లో పాలు-నీళ్లు మాదిరిగా కలిసిపోయే గౌతమి- శృతిహాసన్ ల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారట. దీంతో వీళ్లిద్దరినీ కన్వీన్స్ చేయలేక ‘శభాష్ నాయుడు’కి తలప్రాణం తోకకి వస్తోందని కోలీవుడ్ టాక్. ఇంతకీ అసలేం జరిగింది? కారణమేంటి? అసలు విషయంలోకి వెళ్తే ..

కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ ‘శభాష్ నాయుడు’. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా అమెరికాలో జరిగిన షూట్ డైరెక్టర్ కి హెల్త్ బాగా లేకపోవడంతో ఒకానొక దశలో కమల్ డైరెక్టర్ అవతారమెత్తాడు. సినిమా మాట పక్కనబెడితే.. ఇందులో కమల్ తో శృతిహాసన్ తొలిసారి స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది. ఐతే, ఈ ఫిల్మ్ కి క్యాస్టూమ్స్ డిజైనర్ గా నటి గౌతమి వ్యవహరిస్తోంది. కానీ గౌతమి పని పట్ల శృతిహాసన్ అసంతృప్తి వ్యక్తంచేస్తోందని యూనిట్ చెబుతోందని అంటున్నారు. గౌతమి సూచించిన క్యాస్టూమ్స్ ని శృతి రిజక్ట్ చేసినట్టు టాక్. అంతేకాదు ఆమె పనితనంపై నెగిటివ్ కామెంట్స్ చేసినట్టు కోలీవుడ్ సమాచారం. ఎంతో ప్రొఫెషనల్ గా హుందాగా వ్యవహరించే శృతిహాసన్ ఇలా రియాక్ట్ కావడంతో యూనిట్ సభ్యులు సైతం ఆశ్చర్యపడిపోతున్నారు. మూవీ మాటేమోగానీ కొన్ని విషయాల్లో ఇద్దర్ని కన్వీన్స్ చేయలేక కమల్ హాసన్ ఇబ్బందిపడుతున్నట్లు స్పష్టంగా తెల్సిపోతోందని అంటున్నారు. . మొత్తానికి శభాష్ నాయుడు పుణ్యమానికి ఇటు గౌతమి.. అటు శృతిహాసన్ ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని అంటున్నారు. మరి వీరి మధ్య సయోధ్యకు ఎప్పుడు మార్గం ఏర్పడుతుందో చూడాలి.

ఇది కూడా చూడండి: షాకింగ్ న్యూస్: తెలంగాణా అడవుల్లో సంజీవిని లభ్యం

ఇది కూడా చూడండి: సెంట్రల్ జైల్ ని మరపించే హోటల్

ఇది కూడా చూడండి: 2016 సైమా విజేతలు వీరే..

English summary

Cold War Between Shruti Haasan and Gautami. Shruti Haasan uncomfortable with Gautami.