మెగాబ్రదర్ తో పూరీ వార్.. ఇంక నీకు సినిమాలు ఉండవని తెగేసి చెప్పిన నాగబాబు

Coldwar between NagaBabu and Puri Jagannath

03:53 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Coldwar between NagaBabu and Puri Jagannath

పూరీజగన్నాధ్‌-నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'లోఫర్‌'. ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ సరసన దిశా పటాని హీరోయిన్‌గా నటించింది. 2015 డిసెంబర్‌ లో విడుదలైన ఈ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో హల్‌చల్‌ చేస్తుంది. అదేంటంటే 'లోఫర్‌' సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూరీ దగ్గరుండి చూసుకోలేదట. టాకీ పార్ట్‌ వరకు పూరీ చూసుకుని ఆ తరువాత వర్క్‌ అసిస్టెంట్లకి అప్పజెప్పేశాడట. దీని పై అసంతృప్తి చెంది నాగబాబు-వరుణ్‌తేజ్‌ స్వయంగా వెళ్లి పూరీ జగన్నాధ్ ని కలిసినా ప్రయోజనం లేకపోయిందట.

నేను, నా స్టైల్‌ ఇంతే, కావాలంటే అవుట్‌పుట్‌ చూడండి, అదేగా మనకి ముఖ్యం. 'పోకిరి' సినిమా సమయంలో కూడా నేను ఇలానే చేశా, అయినా నా సీనియర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్లేమీ తక్కువ కాదని తెగేసి చెప్పేశాడట. ఇంక నాగబాబు దీని పై ఏమీ మాట్లాడకుండా వచ్చేశాడట. దాని తరువాత వీరిద్దరి మధ్య కొద్దిరోజులు కోల్డ్‌వార్‌ జరిగిందట. తాజాగా ఇప్పుడది తారా స్థాయికి చేరింది. దీనితో నాగబాబు ఇంక మెగా హీరోలు ఎవ్వరూ కూడా పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో నటించడానికి వీల్లేకుండా నిర్ణయం తీసుకున్నాడట. సినిమా మొదలైనప్పుడు ఒకలా చెప్పి చివరిలో ఒకలా చెయ్యడం నాగబాబుకి నచ్చకపోవడమే దీనికి కారణం.

English summary

Coldwar between NagaBabu and Puri Jagannath from Loafer movie onwards. Now this is came to an end to didn't work any mega hero with Puri.