రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముతున్న మోహన్ బాబు

Collection King Mohan Babu selling Idlis at road side

03:45 PM ON 24th March, 2016 By Mirchi Vilas

Collection King Mohan Babu selling Idlis at road side

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రోడ్డు పక్కన ఇడ్లీలమ్ముతూ కనిపించారు. 500 పైగా సినిమాల్లో నటించిన పెద్ద నటుడు, మంచు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మాణ సంస్థకి అధినేత, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు ఉన్న మోహన్ బాబు ఇడ్లీలమ్మటం ఏంటి అనుకుంటున్నారా? మీకు ఈ పాటికే అర్ధమైపోయే ఉంటుంది. అవును మీరు అనుకున్నది నిజమే, మంచు లక్ష్మీప్రసన్న నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమం కోసం మోహన్ బాబు ఈ పని చేశారు. ఇంతకు ముందు రకుల్ ప్రీత్ సింగ్, రానా, అఖిల్, శ్రియ సరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక సామాన్య ప్రజల్లా పనులు చేసి డబ్బులు సంపాదించి ఆపదలో ఉన్న వారికి సాయబడ్డారు.

ఇప్పుడు తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఎదురుగా మోహన్ బాబు రోడ్డు మీద ఇడ్లీలు అమ్మి, అలా వచ్చిన డబ్బుని మంచు లక్ష్మీ ప్రసన్న నిర్వహిస్తున్న 'మేము సైతం' కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఇప్పటి వరకు పాల్గొన్న సెలబ్రిటీ లవి ఓ ప్రైవేట్ ఛానల్లో ప్రసారం చెయ్యనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే చాలామంది స్టార్స్ తమవంతు సాయం అందించారు. భవిష్యత్తులో మరింత మంది సెలెబ్రిటీ లతో ఇలాంటి పనులని చేయించాలని భావిస్తున్నారు కార్యక్రమ నిర్వాహకులు.

1/6 Pages

పెదరాయుడు హోటెల్:

మోహన్ బాబు ఈ అవతారం ఎత్తింది ఈ కుటుంబం కోసమే.

English summary

Collection King Mohan Babu selling Idlis at road side. He is selling Idlis opposite his College and Schools.