ఆ డ్రైవర్ కోసం కలెక్టరే డ్రైవర్ గా మారాడు.. ఎందుకో మీరే చూడండి(వీడియో)

Collector drives car on drivers retirement day

12:34 PM ON 8th November, 2016 By Mirchi Vilas

Collector drives car on drivers retirement day

సాధారణంగా చాలా మంది పెద్ద పెద్ద అధికారులు తమ దగ్గర పనిచేసే డ్రైవర్లను అంతగా పట్టించుకోరు. కొందరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మరికొందరు వాళ్ళ సాధక బాధకాల్లో కూడా పాలుపంచుకుంటారు. కానీ ఓ అధికారి మాత్రం తన డ్రైవర్ పట్ల విభిన్నంగా వ్యవహరించి అందరినీ షాక్ కి గురిచేసారు. అవును నిజం... అది జిల్లా కలెక్టర్ కార్యాలయం. రోజులాగే అక్కడ పనిచేసే ఉద్యోగులు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంతలో ఆ కార్యాలయం ఆవరణలోకి ఓ కారు వచ్చి ఆగింది. అందులోంచి ఆ జిల్లా కలెక్టర్ దిగాడు. వెంటనే కార్ వెనుక డోర్ తీసి అందులో కూర్చున్న వ్యక్తిని సాదరంగా లోపలికి ఆహ్వానించాడు.

ఇదంతా చూస్తున్న కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే, కారు వెనుక డోర్ నుంచి దిగింది ఎవరో కాదు, నిత్యం ఆ కలెక్టర్ కు డ్రైవర్ గా పనిచేసే వ్యక్తే. అందుకే ఆ ఉద్యోగులకు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తీరా విషయం తెలిసి ఆశ్చర్యపోవడం వారి వంతవైంది. ఇంతకీ ఆ జిల్లా కలెక్టర్ ఎందుకలా చేశారంటే... ఓసారి వివరాల్లోకి వెళ్లాల్సిందే...

1/6 Pages

అది మహారాష్ట్రలోని అకోలా జిల్లా. ఆ జిల్లాకు జి. శ్రీకాంత్ మెజిస్ట్రేట్(కలెక్టర్)గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన దగ్గర పనిచేసే డ్రైవర్ దిగంబర్ థక్ మరికొద్ది రోజుల్లో రిటైర్ అవుతున్నాడు. అయితే అందులో విశేషమేముందీ అంటారా..? అవును, దిగంబర్ థక్ గురించి చెప్పుకోవాలంటే విశేషమే ఉంది.

English summary

Collector drives car on drivers retirement day