రెండంకెల వృద్ధే లక్ష్యంగా కలెక్టర్ల సదస్సు 

Collectors Convention on double-digit growth target

11:10 AM ON 14th December, 2015 By Mirchi Vilas

Collectors Convention on double-digit growth target

రెండంకెల వృద్ధే లక్ష్యంగా కలెక్టర్ల సదస్సు విజయవాడలో ఆరంభమైంది. ఎపిసిఎమ్ చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పలు అంశాలు చర్చించబోతున్నారు. 2018 నాటికి అమరావతిలో అడ్మిన్ సిటీ నిర్మాణం అవుతుందని సిఎమ్ చెబుతున్నారు. 2029 నాటికి దేశంలో అగ్రగామిగా ఎపి వుండాలని ఆయన నిర్దేసిస్తున్నారు. అంతేకాదు 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ గమ్య స్థానంగా ఎపి ఉంటుందని ఆయన చెప్పారు.

కాగా రెండవ త్రైమాసిక ఆర్ధిక ఫలితాలను సిఎమ్ చంద్రబాబు విడుదల చేసారు. మత్స్య శాఖ , పశు గణాభివృద్ధి రేటు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆయన అన్నారు. ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు , డిప్యుటీ సిఎమ్ , రెవెన్యు మంత్రి కె ఇ కృష్ణమూర్తి పాల్గొన్నారు. వివిధ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.

English summary

Andhrapradesh cheif minister chandrababu naidu to conduct a meeting with the collectors of the thirteen districts in andhra pradesh on double-digit growth target in a.p