అవకాశాలు లేక పెళ్ళి చేసుకుంటున్న స్వాతి!

Colors Swathi ready for marriage

05:06 PM ON 4th August, 2016 By Mirchi Vilas

Colors Swathi ready for marriage

'కలర్స్' ప్రోగ్రాంతో మంచి గుర్తింపు తెచ్చుకుని.. సడన్ గా సినీ రంగప్రవేశం చేసింది స్వాతి. తొలుత క్యారెక్టర్ రోల్స్ చేసిన స్వాతి ఆ తరువాత హీరోయిన్ గా మారి మంచి నటిగా పేరు తెచ్చుకుంది కానీ.. తెలుగులో ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. తన ప్రతి సినిమాలోనూ మెప్పిస్తున్నా ఆమె మీద మన దర్శక నిర్మాతలకు చిన్నచూపే. కానీ తమిళ.. మలయాళ ఇండస్ట్రీల్లో మాత్రం ఆమెకు మంచి మంచి అవకాశాలు దక్కాయి. తెలుగులో మాత్రం ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయట్లేదు స్వాతి. గత ఏడాది త్రిపురలో స్వాతి లుక్ చూశాక.. ఆమెకు ఇంకో అవకాశం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. తమిళంలో ఒకట్రెండు సినిమాలున్నాయి కానీ.. ఒకప్పట్లా ఊపు మాత్రం లేదు.

తనకు ఇప్పటికే 29 ఏళ్ల వయసు కూడా వచ్చేసిన నేపథ్యంలో పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాలని స్వాతి భావిస్తున్నట్లు సమాచారం. స్వాతి తల్లి ఆమె కోసం కాస్త గట్టిగానే సంబంధాలు చూస్తున్నారట. ఈ ఏడాది ఆఖర్లోపు స్వాతి పెళ్లి ఫిక్సయిపోవడం ఖాయం అంటున్నారు. మరి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతోనే ఆమె జీవితాన్ని పంచుకుంటుందా.. లేక వేరే రంగానికి చెందిన కొత్త వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకుంటుందా అని చూడాలి. హీరోయిన్లు కెరీర్ ముగిశాక చాలా వరకు వ్యాపారవేత్తల్ని పెళ్లి చేసుకుని సెటిలవుతుంటారు. లయ లాంటి వాళ్లు కొందరు డాక్టర్లను పెళ్లి చేసుకుని ఫారిన్లో సెటిలయ్యారు. మరి స్వాతిని చేసుకోబోయేవాడు ఏ ఫీల్డు వాడో చూద్దాం.

English summary

Colors Swathi ready for marriage