రఘుబాబు ఇంట్లో విషాదం!

Comedian Raghu Babu mother was expired

10:53 AM ON 12th May, 2016 By Mirchi Vilas

Comedian Raghu Babu mother was expired

ప్రముఖ కమీడియన్‌ మరియు సినీ నటుడైన రఘుబాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన తల్లి మరియు గిరిబాబు గారి సతీమణి ఎర్ర శ్రీదేవి కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో నిన్న అర్ధరాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. గిరిబాబు విలన్‌గా, సహాయ నటుడిగా ఎన్నో విలక్షణమైన పాత్రల్లో వందల సినిమాల్లో నటించారు. గిరిబాబు-శ్రీదేవి దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు రఘుబాబు కమీడియన్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం స్టార్‌ కమీడియన్‌ గా టాలీవుడ్‌ని ఏలుతున్నారు.

ఇదిలా ఉంటే ఒక్కసారిగా శ్రీదేవి మృతితో రఘుబాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీదేవి గారి మృతదేహాన్ని గిరిబాబు స్వగ్రామం ప్రకాశం జిల్లా రావినూతలకు తరలించారు.

English summary

Comedian Raghu Babu mother was expired. Tollywood star comedian Raghu Babu mother Sridevi was expired due to kidney disease.