స్వర్గీయ ఎన్టీఆర్ తో సమానంగా పారితోషికం తీసుకున్న కమెడియన్ ఎవరో తెలుసా?

Comedian Raja Babu taken remuneration equally with Ntr

03:33 PM ON 1st October, 2016 By Mirchi Vilas

Comedian Raja Babu taken remuneration equally with Ntr

మానవత్వం మనిషి లక్షణం. అది లేకపోతే అసలు మనిషే కాదు. కానీ ఆ మానవత్వం మితిమీరితే మనిషి రోడ్డున పడతాడు. అచ్చం మన హీరో హాస్యనట చక్రవర్తి రాజబాబులా! ఒక సినిమాలో హీరోగా ఎన్టీఆర్ పారితోషికం 35వేల రూపాయలు. రాజబాబు పారితోషికం 20వేల రూపాయలుగా నిర్ణయించారు నిర్మాత. తనకూ 35వేల రూపాయలు కావలసిందే అని పట్టుపట్టాడు రాజబాబు. ఎన్టీఆర్ హీరో మీరు కమెడియన్ అని నిర్మాత నసిగితే.. అయితే హీరోనే కమెడియన్ గా చూపించి సినిమాను విడుదల చేయండి అని రాజబాబు సమాధానం చెప్పారు. ఈ విషయం ఓ సందర్భంలో రాజబాబు తమ్ముడు చిట్టిబాబు స్వయంగా చెప్పారు.

1/13 Pages

'అంతస్తులు' సినిమాలో నటించినందుకు..

జగపతి వారి 'అంతస్తులు' సినిమాలో నటించినందుకు 13వందల రూపాయల పారితోషికం ఇచ్చారు. అదే రాజబాబు తొలిసారిగా తీసుకున్న పెద్ద మొత్తం. ఆ తరువాత హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి రాజబాబు సినీ జీవితంలో. గంటల చొప్పున నటించిన నటుడు. ఒక గంట ఎన్టీఆర్ తో నటిస్తే, మరో గంట శోభన్ బాబు సినిమాలో ఇతరుల సినిమాల్లో నటించిన రికార్డు రాజబాబుది. డబ్బుకు, పరపతికి కొదవ లేదు. కుటుంబంతో గడపలేనంత బిజీగా, తన గురించి తాను ఆలోచించుకోలేంత బిజీగా మారిపోయాడు.

English summary

Comedian Raja Babu taken remuneration equally with Ntr