హీరోగా మారిన మరో కమెడియన్

Comedian Sathyam Rajesh turns into Hero

04:14 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Comedian Sathyam Rajesh turns into Hero

హాస్యనటుడు రాజేష్‌ అని చెప్పండి ఈ పేరు ఎవరకీ తెలిదు, అదే 'సత్యం' రాజేష్‌ అని చెప్పండి ఇట్టే గుర్తు పట్టేస్తారు. 'సత్యం' సినిమాతో హాస్యనటుడుగా మంచి గుర్తింపు పొందిన రాజేష్‌ ఈ చిత్రంలో తన నటనకు గానూ రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తరువాత మాస్‌, చిరుత, పూలరంగడు, మిర్చి, దోచేయ్ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పడు ఈ హాస్యనటుడు హీరోగా మారుతున్నాడు. ఒకప్పుడు హాస్యనటుడు అలీ కూడా కధానాయకుడిగా మారి పలు చిత్రాల్లో నటించినవాడే.

కమీడియన్‌ సునీల్‌ కూడా హీరోగా మారి ఇప్పడు చక్రం తిప్పుతున్నాడు. ఇప్పుడు 'సత్యం' రాజేష్‌ కూడా హీరోగా మారి సునీల్‌కు పోటీ ఇవ్వనున్నాడు. త్రిష నటిస్తున్న 'నాయకి' చిత్రంలో రాజేష్‌ నటిస్తున్నాడు. అయితే రాజేష్‌ త్రిష సరసన హీరోగా నటించకపోయినా హీరో ప్రాధన్యం ఉన్న పాత్రలోనే నటిస్తున్నాడు. అయితే రాజేష్‌ సరసన మలయాళ ముద్దుగుమ్మ సుష్మారాజ్‌ కథానాయికగా నటిస్తోంది. హర్రర్‌ కామెడీ చిత్రంగా తెరకెక్కుతున్న 'నాయకి' చిత్రంలో గణేష్‌ వెకట్‌రామన్‌ కూడా మరో హీరోగా నటిస్తున్నారు. ఆకాశమంత చిత్రంలో త్రిషకు జోడిగా నటించిన వెంకట్‌ ఈ చిత్రంలో కూడా త్రిష సరసన నటిస్తున్నారు.

2016 ఫిబ్రవరి లో విడుదలవుతున్న ఈ చిత్రం విజయం పై 'సత్యం' రాజేష్‌ కెరీర్‌ ఆధారపడి ఉంది. ఈ చిత్రం హిట్‌ ఈఅయితే రాజేష్ సునీల్‌కు కచ్చితంగా పోటీ ఇవ్వగలడు.


English summary

Comedian Sathyam Rajesh turns into Hero in Trisha Naayaki movie.