త్రిష ఎద పై టాటూ అతనికి ఇష్టమట

Comedian Srinivas Reddy likes Trisha fish tattoo

05:35 PM ON 20th April, 2016 By Mirchi Vilas

Comedian Srinivas Reddy likes Trisha fish tattoo

హాట్ బ్యూటీ త్రిష నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'నాయకి' ఆడియో నిన్న ఘనంగా విడుదలైంది. ఈ ఆడియో వేడుకకి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. అయితే ‘నాయకి’ సినిమా సంగతి ఎలా ఉన్నా.. త్రిషని మాత్రం చాలా మంది పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. ఎప్పుడూ లేని విధంగా త్రిష ఈ ఆడియో వేడుకలో చాలా హాట్ గా, తన ఎద పై టాటూ కనిపించేలా, తన ఎద అందాలు కనిపించేలా, చాలా స్టైలిష్ గా ముస్తాబై వచ్చింది. ఆడియో రిలీజ్ కి విచ్చేసిన ఆ చిత్ర నటీనటులు, ముఖ్య అతిధులు త్రిషని పొగడ్తలతో ముంచెత్తారు. ఇదే సందర్భంగా స్టేజి పైకి వచ్చిన కమెడియన్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ..

త్రిష తనకి ఇష్టమైన హీరోయిన్ అని చెబుతూనే.. త్రిష కంటే ఆమె ఎద పై ఉన్న చేప టాటూ అంటేనే నాకు ఇష్టమని మనసులోని మాట బయట పెట్టాడు. ఈ మాటకి త్రిష కూడా కాస్త స్మైల్ ఇచ్చి సైలెంట్ అవ్వగా, త్రిష పక్కన కూర్చున్న బాలయ్య కూడా ఒక నవ్వు విసిరాడు. అయితే ఆడియో కార్యక్రమం అయిపోయాక ఈ విషయమై త్రిష శ్రీనివాసరెడ్డిని అడిగినట్టు యూనిట్ చెబుతోంది. మొత్తానికి నాయకి ఆడియో వేడుక ఘనంగా జరిగింది.

English summary

Comedian Srinivas Reddy likes Trisha fish tattoo. In lady oriented movie Nayaki audio function comedian Srinivas Reddy comments about Trisha hot fish tattoo.