కన్నీటి పర్యంతమైన వేణుమాధవ్(వీడియో)

Comedian Venu Madhav cried infront of media about his death rumours

11:20 AM ON 1st November, 2016 By Mirchi Vilas

Comedian Venu Madhav cried infront of media about his death rumours

కొన్ని వెబ్ సైట్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, బతికి వున్నవాళ్లను చనిపోయినట్లు ప్రకటిస్తున్నాయి. దీంతో సదరు వ్యక్తులు ఆవేదన చెందడమే కాదు, వాళ్ళ కుటుంబసభ్యులు అనారోగ్యం పాలవుతున్నారు. తాజాగా కమెడియన్ వేణు మాధవ్ చనిపోయాడంటూ కొన్ని వెబ్ సైట్లలో వార్తలొచ్చాయి. దీంతో బ్రతికున్న నన్ను ఎందుకు చంపుతారంటూ వేణు వాపోయాడు. ఒక ఛానల్, కొన్ని వెబ్ సైట్స్ తాను చనిపోయానని వార్తలు ప్రచురించాయని ఆ ప్రతులను చూపిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ వార్తలతో తన తల్లి అనారోగ్యం పాలైందని, తన ఫ్యామిలీ మెంబర్స్ కు, తనకు ఎంతో మనోవ్యధను మిగిలుస్తున్నాయన్నాడు.

ఇలాంటి రూమర్లను అరికట్టాలంటూ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చాడు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వ పెద్దల్ని కూడా కలిసి తనకు న్యాయం చేయాలని కోరతానని చెప్పుకొచ్చాడు.

English summary

Comedian Venu Madhav cried infront of media about his death rumours