వేణుమాధవ్‌ చనిపోయాడంటూ పుకార్లు.. ఛానల్ పై కేసు పెట్టిన వేణు

Comedian Venu Madhav puts case on telugu channel and websites

04:21 PM ON 10th May, 2016 By Mirchi Vilas

Comedian Venu Madhav puts case on telugu channel and websites

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ కమీడియన్ గా చక్రం తిప్పిన వేణు మాధవ్ కొంత కాలంగా అనారోగ్యంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇది వరకు ప్రతీ సినిమాలోని కనిపించే వేణుమాధవ్ ఇప్పుడు సినిమాల్లో కనిపించడమే మానేశారు. 2015లో విడుదలైన 'రుద్రమదేవి' చిత్రంలో తప్ప మరే సినిమాలోని వేణు మాధవ్ కనిపించలేదు.. దీనితో ఓ తెలుగు న్యూస్ ఛానల్‌తో పాటు మరో రెండు సోషల్ మీడియా వెబ్‌సైట్లలో తాను చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. దీనితో ఆగ్రహం చెందిన వేణుమాధవ్ ఆ తెలుగు న్యూస్ ఛానల్‌తో పాటు మరో రెండు సోషల్ మీడియా వెబ్‌సైట్ల పై కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

తాజాగా తమిళ కమీడియన్ సెంథిల్ చనిపోయినట్టుగా వార్తలు రావటం, తరువాత ఆయన వీడియో మెసేజ్ ద్వారా తాను బతికే ఉన్నట్టుగా వివరణ ఇచ్చి, రెండు రోజులు కూడా గడవక ముందే తెలుగు నటుడు వేణుమాధవ్కు అలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో వారి పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు వేణుమాధవ్‌.

English summary

Comedian Venu Madhav puts case on telugu channel and websites. Comedian Venu Madhav puts police case on telugu news channel and websites for rumours on his death.