అసెంబ్లీ ఘటనల పై కమిటి

Committee on Assembly Incident

07:33 PM ON 24th December, 2015 By Mirchi Vilas

Committee on Assembly Incident

అసెంబ్లీ శీతకాలసమావేశాల్లో చోటుచేసుకున్న ఘటనలపై డిప్యూటి స్పీకర్‌ అధ్యక్షతన కమిటి ఏర్పాటు కానుంది.వైసిపి ఎం ఎల్ ఎ రోజా సస్పెన్షన్ తో పాటూ , సిడిల వ్యవహారం తదితర అంశాలపై ఈ కమిటీ విచారణ చేస్తుంది. టిడిపి తో పాటూ వైసిపి , బిజెపి సభ్యలు ఈ కమిటీలో వుంటారు. ఈ విషయాన్ని ఎపి అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు చెప్పారు. వచ్చే సమావేసాల్లోగా కమిటీ నివేదిక ఇస్తుందని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు.

శీతాకాల సమావేశాల సందర్భంగా వై.సి.పి సభ్యురాలు అనుచితంగా ప్రవర్పించారన్న అభియోగం పై ఏడాది పాటు సస్పెన్షన్‌ విధించడం, సస్పెన్షన్‌ తొలగించాలని చేసిన విజ్ఞవిని తిరస్కరించడం, ఇందుకు నిరసనగా వైసిపి సభ్యులు సమావేశాలను బహిష్కరించడం తెలిసిందే. సమావేశాలు ముగిసాక, స్పీకర్‌ పై అవిశ్వాస నోటిసును వైసిపి సభ్యులు ఇవ్వడం మరో పక్క అసెంబ్లీలో జరిగిన ఘటనల తాలుకు దృశ్యాలు సి.డి రూపంలో బయటకు వచ్చి సోషల్‌ నెట్‌వర్క్స్‌లో హల్‌చల్‌ చేయడం దీనిపై వైసిపి ఆరోపణలు గుప్పించడం జరిగాయి. మరోపక్క వైసిపి సభ్యులు సభలో వ్యవహరించిన తీరుపై టిడిపి వీడియో ఫుటేజ్ కూడా విడుదల చేసింది.

ఈనేపధ్యంలో గురువారం స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ తానూ ఏపార్టీకి అనుకూలం కాదు, వ్యతితేకం కాదు అన్నారు. సభలో సభ్యుల ప్రవర్తనపై వారినచి , వార్నింగ్ ఇచ్చాకే నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. సాససన సభా వ్య్వవహరాల శాఖ ప్రతిపాదన మేరకు ఎం ఎల్ ఎ రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ చేసినట్లు ఆయన చెబుతూ , సస్పెన్షన్ నిర్ణయం తనది కాదని , సభ నిర్ణయమని ఆయన తెల్పారు.

సభలో జరిగిన ఘటనల దృశ్యాల సిడిలు బయటకు ఎలా వచ్చాయో నిర్ధారణ అవ్వాల్సి వుందని స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు అంటూ , ఉప సభాపతి నేతృత్వంలో ఏర్పాటయ్యే కమిటీ ఈవ్యవహారంపై కూడా విచారణ చేస్తుందన్నారు. ఇక రోజాపై ఏడాదిపాటు విధించిన సస్పెన్షన్ సరిపోతుందా , పెంచాలా , తగ్గించాలా అనే విషయాలను కూడా కమిటీ నివేదిస్తుందని ఆయన అన్నారు. అన్నపార్తీల సభ్యులు కమిటీలో ఉంటారని అందుచేత కమిటీ నివేదిక ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని ఆయన సూచించారు.

కాగా సభలో ఆరోజు జరిగిన అంశాలకు సంభందించి మొత్తం ప్రొసీడింగ్స్ కావాలని వైసిపి సభ్యులు అడగడంతో, అన్ని పార్టీలకు సిడీలు ఇచ్చామని, అయితే ఒకసారి తన అనుమతితో బయటకు వచ్చాక వాటిని ఎలా వినియోగించుకుంటారో తాను ఎలా చెప్పజాలనని ఆయన అన్నారు. ఆనాటి సభలోని దృశ్యాలు ఆయన ప్రస్తావిస్తూ , తన 35 ఏళ్ళ కాలంలో ఎప్పుడూ ఎలాంటి దృశ్యాలు చూడలేదన్నారు.

English summary

Today Speaker in Andhrapradesh Assembly said that , a new committe for the investigation of contreversial Assembly sessions