చరణ్‌-అఖిల్‌ పోటీ పడుతున్నారు!!

Competetion between Akhil and Ram Charan

01:50 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Competetion between Akhil and Ram Charan

ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డులు ఇప్పటివరకూ బాలీవుడ్‌ ఇండస్ట్రీలో మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మొదటిసారిగా తెలుగు, కన్నడ, తమిళ్‌, మలయాళం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా అవార్డులు ఇవ్వనున్నారు. ఈ వేడుక హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 24, 25 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుక మొట్టమొదటి సారి హైదరాబాద్‌ లో జరగడంతో టాలీవుడ్‌ స్టార్స్‌ అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ ఉత్సవాలలో అక్కినేని హీరో అఖిల్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, లైవ్‌ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌ చేయబోతున్నారు. దీని కోసం ప్రాక్టీసులు కూడా మొదలుపెట్టేసారు.

అందుకోసం ప్రముఖ కొరియోగ్రాఫర్లను ఎంచుకున్నారు. వేరే కాకుండా ఈ ఐఫా వేడుకల్లో చాలా మంది టాప్‌ స్టార్స్‌ పాల్గొనున్నారు. ఈ వేడుక 2015 డిసెంబర్‌ లో చెన్నై లో జరగాల్సి ఉంది. కానీ చెన్నైలో వరదలు వల్ల వాయిదా పడింది.

English summary

Competetion between Akhil and Ram Charan. They are giving live dance performance in IIFA awards festival.