వివాదంలో చిక్కుకున్న ‘శివాయ్’

Complaint filed against ajay devgan upcoming movie shivay

03:28 PM ON 26th May, 2016 By Mirchi Vilas

Complaint filed against ajay devgan upcoming movie shivay

ఈమధ్య పలు సినిమాలు వివాదమవుతున్నాయి. కొందరు కావాలని ఇరుక్కుంటుంటే, మరికొందరు పరిస్థితుల ప్రభావంతో తమ సినిమాలు వివాదంలోకి చేరిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శివాయ్’ చిత్రంతో అజయ్ వివాదంలో చిక్కుకున్నట్లు కన్పిస్తోంది. అజయ్ దేవ్ గణ్ తన సొంత బ్యానర్ అజయ్ దేవ్ గణ్ ఎఫ్ ఫిల్మ్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అజయే దర్శకత్వం వహిస్తూ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. చిత్ర పోస్టర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని డిల్లీలోని కొందరు తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శివాయ్ పోస్టర్ లో శివుడి విగ్రహం ఎక్కేటపుడు అజయ్ దేవ్ గణ్ బూట్లు ధరించి ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకో పోస్టర్ లో ఐస్ తో చేసిన శివుడి ఆయుధం త్రిశూలాన్ని అజయ్ పట్టుకొని ఉన్నాడు.

అజయ్ సరసన సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది దీపావళి నాటికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు వివాదం నుంచి బయట పడ్డానికి ఏం చర్యలు చేపదటారో చూడాలి.

English summary

Complaint filed against ajay devgan upcoming movie shivay. Ajay Devgan has landed into a trouble because the actor is using an ice axe on the head of Lord Shiva.