కొత్త జిల్లాల కుంపటి రాజుకుంది

Concern For New Districts In Telangana

11:16 AM ON 2nd July, 2016 By Mirchi Vilas

Concern For New Districts In Telangana

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నం కొలిక్కి వస్తున్న వేళ, నిప్పు రాజుకుంది. రగిలిన ఈ చిచ్చు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వరంగల్ జిల్లా జనగామలో ప్రత్యేక జిల్లా కోసం చేపట్టిన ఆందోళనలో ఆందోళనకారులు రెచ్చిపోయారు.. పోలీసు, ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేసి, తగలబెట్టారు. ఈ దాడితో మొత్తం 20 వాహనాలు ధ్వంసమయ్యాయని అంటున్నారు. అక్కడి నేషనల్ హైవేని సైతం వారు దిగ్బంధం చేశారు.

పరిస్థితి తీవ్రం కావడంతో పోలీసులు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ స్థంభించింది... పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాలను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ ప్రత్యేక సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన సాగింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డికె అరుణ, సంపత్ కుమార్ లను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి:తల్లే చంపేసింది ... ఔను చంపేశారట

ఇవి కూడా చదవండి:అమ్మ తోడు... సైకిళ్ళపై గస్తీ తిరగాల్సిందేనట

English summary

Telangana Government was announced they were going to increase the districts in Telangana and now people were demanding government their would be new district and the issue was turned violent in Telangana.