రంగా ఫోటో లేదని ఆందోళన

Concern For Not Having Ranga Photo In Congress Meeting

11:18 AM ON 25th January, 2016 By Mirchi Vilas

Concern For Not Having Ranga Photo In Congress Meeting

కాపుల రిజర్వేషన్ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది. ఓ పక్క ప్రభుత్వం ఇందుకోసం కమిషన్ వేయగా , మరోపక్క కమిషన్ కాలయాపన కోసమేనని విమర్శిస్తూ , జనవరి 31న తూర్పుగోదావరిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఓ సభ పెడుతున్నారు. భారీ ఎత్తున ఇందుకోసం ఏర్పాట్లలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ సభల్లో భాగంగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన కాపు రిజర్వేషన్ సభ గందరగోళానికి దారితీసింది . ఈ సభకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చారు. కాపులను ఓటు యంత్రాలుగా చూస్తున్నారని రఘువీరా విమర్శించారు. టిడిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారిని బీసీల్లో ఎందుకు చేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఉద్యమంలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. అయితే, సభలో వంగవీటి రంగా ఫోటో లేదని కొందరు ఆందోళనకు దిగారు. వంటవీటి రంగా ఫోటో పెట్టక పోవడాన్ని వారు తప్పుబట్టారు.

దీని పై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి అసహనం వ్యక్తం చేసినా, ఆ తర్వాత కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సభలో వున్న నేతలే మైకు అందుకుని 'రంగా అమర్ రహే' అంటూ రంగా గురించి నినాదాలు చేయడంతో వివాదం సద్దుమణిగింది.

English summary

Andhra Pradesh Congress Party Leader Raghu Veeera Reddy Says that TDP government has not taking care of "Kapu" caste people.And some of the people concern in that meeting for not having Vanga Veeti Mohana Ranga photo in Congress party meeting