కండోమ్ లు కావాలా అంటూ ఒలింపిక్స్ లో పంచి పెడుతున్నారు!

Condoms are giving in Olympics

01:17 PM ON 22nd August, 2016 By Mirchi Vilas

Condoms are giving in Olympics

ఆ మధ్య వచ్చిన పెళ్ళిసందడి సినిమాలో పెళ్లి సీన్ లో టిఫిన్లు తిన్నారా, కాఫీలు తాగారా అంటూ పదే పదే అడుగుతూ కడుపుబ్బా నవ్విస్తారు. కానీ రియోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో సరిగ్గా ఇలానే అడుగుతున్నారు. అది తిండి గురించి కాదు సుమా. అదేమిటంటే కండోమ్స్ గురించి... అవును నిజం.. గత ఒలింపిక్స్ లో ఎన్నడూ లేని విధంగా, రియోలో క్రీడాకారుల కోసం నిర్వాహకులు 4.5 లక్షల కండోమ్స్ సరఫరా చేశారు. ఇందులో 3.5 లక్షలు పురుషుల కోసం కాగా.. లక్ష మహిళల కండోమ్ లు వున్నాయి. సురక్షిత శృంగారాన్ని ప్రోత్సహించడానికి ప్రతి అథ్లెట్ కూ సగటున 42 కండోమ్ లు అందజేశారు.

అవి కూడా సరిపోవనో ఏమో, ఎరిక్ లాంటివారిని కొందరిని నియమించారు. వారికి 'మినీ కండోమ్ టీమ్' అని పేరు పెట్టారు.

1/3 Pages

మెడలో బ్యాగ్ తగిలించుకుని మరీ...


వారి మెడలకు పారదర్శకంగా ఉండే బ్యాగును తగిలించి అందులో కంటికింపుగా కనిపించే ఆకుపచ్చ రంగులో ఉన్న కండోమ్ ప్యాకెట్లను పెట్టి పంచిపెట్టమని పురమాయించారు. ఆ బ్యాగు మోసుకుని ఒలింపిక్ గ్రామమంతా తిరుగుతూ మాంచి జోష్ లో ఉన్న అథ్లెట్లకు కండోమ్ లు కావాలా నాయనా అని అడిగి వాటిని అందజేయడమే వీరి పని. రోడ్జర్ షెర్మన్ అనే వ్యక్తి.. ఎరిక్ ఫొటోను ట్విట్టర్ లో పెట్టగా వేలాది మంది దాన్ని రీట్వీట్ చేశారు. అంతే.. ఎరిక్ కాస్తా ఓవర్ నైట్ ట్విటర్ సంచలనంగా మారిపోయాడు.

English summary

Condoms are giving in Olympics