మిస్ యూనివర్స్ విజేతపై కన్ఫ్యూజన్

Confusion In 2015 Miss Universe Competition

04:34 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Confusion In  2015 Miss Universe Competition

ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతను ప్రకటించే సమయంలో ఫుల్ కన్ఫ్యూజన్ ఏర్పడింది.

ఆదివారం రాత్రి ఈ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అమెరికా, ఫిలిప్పైన్స్, కొలంబియా దేశాలకు చెందిన ముగ్గురు యువతులు తుదిపోటీలో నిలవగా.. మిస్ ఫిలిప్పీన్స్ ఈ కిరీటాన్ని దక్కించుకుంది. అయితే ఆమెను విజేతగా ప్రకటించే ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మిస్ యూనివర్స్ కిరీటాన్ని కొలంబియా యువతి గుటిరేజ్ గెలుచుకున్నట్లు నిర్వాహకులు తొలుత ప్రకటించడంతో ఆమెకు కిరీటాన్ని తొడిగారు. నిజంగానే మిస్ యూనివర్స్ టైటిల్ వచ్చిందని భావించి సంతోషంలో ఉన్న గుటిరేజ్ కు అంతలోనే షాకిచ్చిన నిర్వాహకులు 'వి ఆర్ రియల్లీ సారీ..' మిస్ యూనివర్స్ గెలుచుకుంది మీరు కాదు ఫిలిప్పీన్స్ యువతి ఉర్జ్ బ్యాక్ అని ప్రకటించారు. దీంతో కొన్ని క్షణాల పాటు మిస్ యూనివర్స్ గా ఉన్న మిస్ కొలంబియా షాక్ కు గురైంది. నిర్వాహకులు మిస్ కొలంబియా నుండి కిరీటాన్ని వెనక్కి తీసుకొని మిస్ ఫిలప్పైన్స్ గుటిరేజ్ కు తొడిగారు. పొరపాటున మిస్ యూనివర్స్ గా ప్రకటించబడ్డ మిస్ కొలంబియా దీనిపై మాట్లాడుతూ 'ఇది నిర్వాహకులు కావాలని చేసిన పొరపాటు కాదు. అలా జరిగిపోయింది. దీని గురించి నేనేం బాధ పడట్లేదు' అని తెలిపింది. ప్రతిష్టాత్మకమైన పోటీల్లో నిర్వాహకుల తప్పిదం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

English summary

The Judge Steve Harvey mistakenly first announced that Miss Colombia as Miss Universe but later they said that they was said by mistake and the winner of that competetion is Philippines Pia Alonzo Wurtzbach