ఓరి నాయోనో!, ఇంతకీ వందో సినిమా ఎవరితో ...

Confusion On Balakrishna 100th Film

09:56 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Confusion On Balakrishna 100th Film

డిక్టేటర్ హిట్తో ఫుల్ జోష్లో ఉన్న బాలయ్య వందో చిత్ర విశేషాలు హుషారుగా చెప్పేసినా, ఇప్పుడు మనసు మారిందట. 99వ సినిమా ఇంత హిట్ అయితే , ఇక వందో సినిమా కూడా ఆ రేంజ్ దాటేలా వుండాలని భావిస్తున్నాడట. అందుకే పునరాలోచన లో పడ్డట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. 100వ సినిమాగా 'ఆదిత్య 999' చేసేస్తున్నానని, సిగీతం శ్రీనివాసరావు దీనికి డైరెక్టర్ అని స్వయంగా బాలకృష్ణ ప్రకటించినా, ఇప్పుడు సడన్ గా మనసు మార్చుకున్నాడు. అందుకే వందవ సినిమా ఎవరి డైరెక్షన్‌లో వుంటుందనేది ఇంకా క్లియర్‌ అవ్వలేదట. ఇప్పటికీ చాలా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ వందవ సినిమాపై వుండే అంచనాలకి తగ్గ సినిమానే చేయాలని డిసైడ్‌ అవ్వడంతో బోయపాటి శ్రీను పేరు మళ్ళీ తెర మీదకి వచ్చింది. అయితే ఇంకా దానిపై క్లారిటీ రాలేదు. మరోపక్క 'రామారావుగారు' టైటిల్ తో అనిల్‌ రావిపూడి ఒక కథ సిద్ధం చేస్తున్నాడని వార్తలొచ్చాయి. దిల్‌ రాజు నిర్మాణంలో ఈ సినిమా వుంటుందని కూడా ప్రచారం జరిగింది.

తాజాగా 'గమ్యం' డైరెక్టర్ క్రిష్ కూడా బాలకృష్ణకు ఓ సబ్జెక్ట్ వినిపించాడని, అది బాలకృష్ణకు బాగా నచ్చిందనే టాక్ నడుస్తోంది. దీంతో బాలయ్య వందో సినిమాకు క్రిష్ దర్శకుడిగా ఖరారైనట్లే అనే వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో బాలకృష్ణ వందో సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తాడా..? బోయపాటి శ్రీనా, లేదంటే అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తాడా, ఆఖరికి క్రిష్ దర్శకత్వంలో నటిస్తాడా..? అనే అయోమయంలో బాలయ్య అభిమానులు ఉన్నారు. కాగా జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా వందో సినిమా ప్రారంభమవుతుందని, కాదు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న మొదలు కానుందని .ఇలా బాలకృష్ణ నూరవ చిత్రం గురించి రోజుకో వార్త మోసుకొస్తున్నా, ఇంకా తర్జన భర్జనలే పడుతున్నాడట. అయితే వందవ సినిమా గురించి పక్కాగా క్లారిటీ ఇవ్వడం లేదు.

English summary

Hero Nandamuri Balakrishna’s 100th film was creating a big confusion to his fans. There were names of Singeetam Srinivas Rao for ‘Aditya 999’ then Boyapati Srinu and also ‘Pataas’ fame Anil Ravipudi in combination with producer Dil Raju.But Balayya did not give clarity on that movie still now.