వంద ఎవరిదీ నంద నందనా ...

Confusion Still Continues On Balakrishna 100th film

03:49 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Confusion Still Continues On Balakrishna 100th film

అబ్బో, ఒకరా ఇద్దరా ఏకంగా అరడజను మంది డైరెక్టర్లు క్యూ కట్టారు ... మోస్ట్ సీనియర్లతో పాటు కొత్త వాళ్ళు కూడా ఇందులో వున్నారు. ఇంతకీ ఎవరికోసం అంటారా? ఇంకెవరు నందమూరి అందగాడు బాలయ్య కోసం ... ఎందుకంటే, బాలయ్య 100వ సినిమా పై పెరిగిన క్రేజ్ అది. ఆరునూరైన యాక్షన్ చిత్రమే అయి వుండాలని అభిమానులు తీవ్రంగా వత్తిడి చేయడమే ఇందుకు కారణం. పైగా ఈ సంక్రాంతికి ‘డిక్టేటర్‌’గా వచ్చి మెరుపులు మెరిపించిన నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు సెంచరీ చిత్రంలో బాలయ్య మరెన్ని మెరుపులు చూపిస్తాడో నని మరోపక్క చిత్రసీమ ఆశగా ఎదురుచూస్తోంది . ఈ విధంగా వందో సినిమాపై అటు అభిమానుల్లోనూ, ఇటు చిత్రసీమలోనూ భారీగా పెరిగిపోయాయి. దీంతో బాలయ్య కథ, దర్శకుడి ఎంపిక విషయంలో ఆచితూచి స్పందిస్తున్నాడు. వీలైనన్ని ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉంచుకుంటున్నాడు. బాలకృష్ణ సెంచరీ సినిమా విషయంలో రోజుకో దర్శకుడి పేరు వినిపిస్తుండడంతో ఈ సినిమాపై ఆసక్తి తారాస్థాయికి చేరింది.

మొదట్లో సీనియర్ దర్శకుడు సిగీతం శ్రీనివాసరావు తో ఆదిత్య 369కి కొనసాగింపు గా అన్నట్లు ఆదిత్య 999 చిత్రం వందవ చిత్రంగా చేయాలని బాలయ్య భావించాడు. ఈమేరకు నిర్ణయం కూడా దాదాపు ప్రకటించాడు. కానీ ఆ తర్వాతే పరిణామాలు మారాయి. వాస్తవానికి బాలయ్య ఆలోచన ప్రకారం వందో సినిమా ఫక్తు కమర్షియల్‌ చిత్రంలా కాకుండా, ఓ కొత్త దనం ఉండాలని.... అందుకే నూరో సినిమా ఆలస్యం అవుతోంది. సింగీతం శ్రీనివాసరావు ‘ఆదిత్య 999’ కథ బాలకృష్ణ కోసమే సిద్ధం చేశారు. వీరిద్దరి కలయికలో ఇదివరకు ‘భైరవద్వీపం’, ‘ఆదిత్య 369’లు వచ్చి అఖండ విజయం సాధించాయి. అందుకే ఈ కాంబినేషన్‌పై గురి కుదురుతోంది. తాజాగా బాలయ్యను క్రిష్‌ కలిసి అతనికి సూటయ్యే ఓ వినూత్న కథ తన దగ్గర ఉందని చెప్పాడట. ఈ కాంబినేషన్‌లోనూ ఓ సినిమా వచ్చే అవకాశాలున్నాయని చెప్పుకొంటున్నారు.

సీనియర్‌ దర్శకుడు కృష్ణవంశీ ఓ సోషియో ఫాంటసీ కథతో రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది బాలయ్యతో ఈసినిమా చేద్దామని, అది కూడా 100వ చిత్రం అయితే మంచి లుక్ వస్తుందని కృష్ణ వంశీ ఆలోచన గా వుందట. ఇక ‘రుద్రమదేవి’కి సీక్వెల్‌గా ‘ప్రతాప రుద్రుడు’ తెరకెక్కిస్తానని గుణశేఖర్‌ ఇప్పటికే చెప్పేయడంతో, ఆ ‘ప్రతాప రుద్రుడు’ బాలయ్యే అని ఫిల్మ్‌నగర్‌ టాక్ నడుస్తోంది. అన్నీ కుదిరితే... అదే 100వ చిత్రం అని అంటున్నారు. ‘రామారావుగారు’ అనే ఓ పొలిటికల్‌ సెటైర్‌ని కొత్త దర్శకుడు అనిల్‌ రావిపూడి రాసుకుని కూర్చున్నాడు. అది బాలకృష్ణ కోసమేనని, దీన్నే 100వ చిత్రంగా ఎంచుకోవాలని అంటున్నాడట. మరి ఇలా ఒకరి తర్వాత ఒకరు కధలతో క్యూ కడుతుంటే, మరి బాలయ్య ఎవరికీ ఒకే చేస్తాడు. అది యాక్షన్ చిత్రమా , డిఫరెంట్ రోలా , ఎలా వుంటుంది. 100వ సినిమాను డైరెక్ట్ చేసే అదృష్టం ఎవరిని వరిస్తుంది ... ఈ ప్రశ్నలకు త్వరలోనే తెరవేయాలని బాలయ్య భావన. ఏది ఏమైనా ఏప్రియల్ , మే నెలల్లో బాలయ్య నూరవ చిత్రం పట్టాలెక్కడం మాత్రం ఖాయంగా చెబుతున్నారు.

English summary

Confusion still continues on Nandamuri Balakrishna's 100th film.Many directors come into news but no one was confirmed by Balakrishna.