కాంగ్రెస్‌ 131వ వ్యవస్థాపక వేడుకలు

Congress 131st Foundation Day Cermony Celebrations

05:10 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Congress 131st Foundation Day Cermony Celebrations

కాంగ్రెస్‌ పార్టీ 131 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకను ఢిల్లీ లో ఘనంగా నిర్వహించారు. ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యాలయంలో ఈ వేడుకను కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఏఐసీసీ ప్రెసిడెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధి కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగురవేసి ఈ వేడుకలను ప్రారంభించారు.

ఈ వేడుకకు కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, ఆనంద్‌ శర్మ, షీలా దీక్షిత్‌, గులాం నబీ ఆజాద్‌, మనీష్‌ తివారీ వంటి అనేక మంది కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధి జెండాను ఆవిష్కరించిన తరువాత ఆమె ఆ పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. మహాత్మ గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రు, ఇందిరా గాంధీ వంటి అనేక మంది కాంగ్రెస్‌ కాయకుల విగ్రహాలకు పుష్పాలతో నివాళులర్పించారు.

English summary

Today Congress celebrates its 131st Foundation Day Cermony. Its a old political party in india.