వరంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి మార్పు

Congress Changes The LokSabha Member Of Warangal

05:30 AM ON 1st January, 1970 By Mirchi Vilas

Congress Changes The LokSabha  Member  Of  Warangal

వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ పేరును హైకమాండ్ ఖరారు చేసింది . ఈ మేరకు కాంగ్రెస్ అధికారికంగా ప్రకటన చేయనుంది. ఖాళీ బీఫాంత వరంగల్‌కు బయలుదేరిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంట సర్వే కూడా బయలుదేరారు. అక్కడి నేతలతో చర్చించిన అనంతరం సర్వే పేరును ప్రకటించే అవకాశం వుంది .వాస్తావానికి వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజయ్య పేరు ప్రకటించడం ఆయన ఈవేళ నామి నేషన్ వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే గత రాత్రి రాజయ్య కోడలు నివాసంలో జరిగిన అగ్నిప్రమాదంలో కోడలు,ముగ్గురు మనవళ్లు సజీవదహన మయ్యారు. దీంతో వరంగల్ ఉపఎన్నికలో అభ్యర్థిత్వం నుంచి తప్పుకుంటున్నట్లు రాజయ్య ప్రకటించారు. కొత్త అభ్యర్థి కోసం ఉదయం నుంచి మంతనాలు నిర్వహించిన అనంతరం సర్వే సత్యనారాయణతోపాటు కొండేటి శ్రీధర్‌, అద్దంకి దయాకర్‌ల పేర్లను కాంగ్రెస్‌ నేతలు హైకమాండ్‌కు సూచించారు. చివరకు సర్వే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో పీసీసీ అధ్యక్షుడు వరంగల్ అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 3 గంట లలోగా నామి నేషన్ వేయాల్సి వుంది .

English summary

Congress Changed his Member for by-elections in warangal.Previously selected Rajayya has withdrawn his nomination due to a sudden incident occur in his family.Later Congress high command selected Sarvey Satyanarayana for that position.