కాంగ్రెస్  'హెరాల్డ్' ఆందోళన  

Congress Concern On National Herald Case

01:12 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Congress Concern On National Herald Case

పాటియాలా కోర్టుకి సోనియా గాంధీ , రాహుల్ గాంధి హాజరవుతున్న నేపధ్యంలో దేశంలో పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కావాలనే సోనియా అండ్ సన్ ని వేధిస్తోందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం ప్రధాని మోడీ , డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి దిష్టి బొమ్మలను గాడిదలపై ఊరేగించారు. రంగా రెడ్డి కలక్టరేట్ దగ్గర కాగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్ , శ్రీశైలం గౌడ్ ,సుదీర్ లను పోలీసులు అరెస్టు చేసారు. కొన్ని చోట్ల దిష్టి బొమ్మలను దగ్దం చేసారు. హైదరాబాద్ కరీం నగర్ , ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఆందోళనలు సాగాయి. కొన్ని చోట్ల ఆలయాల్లో పూజలు చేసారు.

విజయవాడ ఆంద్ర రత్న భవన్ ఎదుట యూత్ కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతోఒ , ప్రధాని మోడీ తీరుని విమర్శించారు. ఏలూరు రోడ్ లో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఏలూరు , రాజమండ్రి , కాకినాడ , తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు.

కాగా పాటియాలా కోర్టుకి సోనియా గాంధి ,రాహుల్ గాంధి హాజరవుతున్న నేపధ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటూ గట్టి నిఘా పెట్టారు.

English summary

Congress party leaders concerns About National Herald in Andhra Pradesh And Telangana States. Various congress party leaders were opposed that Sonia Gandhi And Rahul Gandhi To Appear in Court