పుదుచ్చేరి లో కాంగ్రెస్‌-డీఎంకే కూటమి

Congress DMK Alliance Won In Puducherry

05:55 PM ON 19th May, 2016 By Mirchi Vilas

Congress DMK Alliance Won In Puducherry

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌-డీఎంకే కూటమి మొత్తం 30 స్థానాల్లో 17 గెలిచి ఘనవిజయం సాధించింది. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా పుదుచ్చేరిలో అధికారంలో వున్న ఏఐఎన్‌ఆర్‌సీ నేత, సీఎం రంగస్వామి పాలనకు తెరపడింది. ఏఐఎన్‌ఆర్‌సీ 8, అన్నాడీఎంకే 4, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. రంగస్వామి ఓటమితో అన్నాడీఎంకే ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. 2008లో కాంగ్రెస్‌నుంచి వేరుపడిన రంగస్వామి సొంతంగా పార్టీని ఏర్పాటుచేశాడు. 2011 ఎన్నికల్లో ఆయన అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నాడు. విజయం సాధించిన అనంతరం అన్నాడీఎంకేతో తెగతెంపులు చేసుకోవడం జయకు ఆగ్రహం కలిగించింది. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ అన్నాడీఎంకే అభ్యర్థులను నిలపడంతో రంగస్వామి సారథ్యంలోని ఏఐఎన్‌ఆర్‌సీకి నష్టం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి: అవకాశం ఇస్తానని తన ఇంటికి ఒంటరిగా రమ్మన్నాడు: అపరాజిత

సీఎంగా నమశ్శివాయకు అవకాశం ....
తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌-డీఎంకేలు కూటమిగా ఏర్పడ్డాయి. పీసీసీ అధ్యక్షుడు నమశ్శివాయ విల్లియనూర్‌ స్థానంనుంచి గెలుపొందారు. కాంగ్రెస్‌ కూటమి మెజార్టీస్థానాలు సాధించడంతో నమశ్శివాయకు సీఎం అయ్యే అవకాశముందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: పశ్చిమ బంగాలో దీదీకే పట్టం - 27న మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం

ఇవి కూడా చదవండి: 13వ సారి గెలిచిన కరుణానిధి

English summary

Congress Party and DMK party alliance won in Puducherry Elections. This Alliance won 17 seats out 30 seats. Namah Shivaya to be elected as chief minister of Puducherry