స్మృతి ఇరానీకి  మోడికి లింక్ పెట్టిన కాంగ్రెస్‌ నేత

Congress Leader Contreversial Words About Modi

01:37 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Congress Leader Contreversial Words About Modi

ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడి ని ఇరకాటంలో పెట్టడానికి పలు ఆరోపణలు సంధించిన కాంగ్రెస్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం రేపింది. మోడీకి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండో భార్య అంటూ మాజీ మంత్రి కాంగ్రెస్‌ పార్టీ లీడర్‌ నీలమణి సేన్‌ డేకా చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల ఫలితంగా అస్సాం లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అస్సాం ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని, నీలమణిని అరెస్ట్‌ చెయ్యాలని బీజేపీ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యకర్తలు చేసిన దాడిలో కాంగ్రెస్‌ నాయకులు గాయపడ్డారనీ, మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయని పోలీసులు తెలిపారు. వారిని ఆపడానికి టియర్‌ గ్యాస్‌ ను ప్రయోగించామని అన్నారు.

ఇలా ఉంటే ఈ వివాదస్పద విషయం పై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి తరుణ్‌ గొగొయ్‌ కాంగ్రెస్‌ నాయకుడు నీలమణి వ్యాఖ్యలను ఖండించాడు. నీలమణి వెంటనే స్మృతి ఇరానీ పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఒక బాధ్యత గల వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం సరికాదని అన్నారు.

నీలమణి చేసిన వ్యాఖ్యలను అనేక మంది ప్రముఖులు ఖండించారు. ఇప్పుడు నీలమణి పై అనేక చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

English summary

Ex Congress minister made shameful Controversial comments about Smriti Irani and Narendra Modi.