'హైదరాబాద్ అందరిదీ' అంటున్న కాంగ్రెస్‌  మేనిఫెస్టో

Congress Manifesto In GHMC Elections

10:39 AM ON 25th January, 2016 By Mirchi Vilas

Congress Manifesto In GHMC Elections

హైదరాబాద్‌లో సెటిలర్ల సంక్షేమానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్న సంకేతాలు అందిస్తూ, హైదరాబాద్ అందరిదీ అనే నినాదంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీ భవన్‌లో విడుదల చేశారు. ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌, తాగునీటికి అత్యంత ప్రాధాన్యం , అంతర్జాతీయ మురుగునీటి వ్యవస్థ నిర్మాణం, ప్రజా రవాణాపై దృష్టి , క్రీడల ప్రోత్సాహంపై ప్రత్యేక శ్రద్ధ ,యుద్ధ ప్రాతిపదికన వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం,సౌర- పవన విద్యుత్‌కు ప్రాధాన్యం, నగరంలో ప్లాస్టిక్‌ నిషేధం ,వారసత్వ కట్టడాలపై ప్రత్యేక దృష్టి , శ్మశాన వాటికల సంఖ్య పెంచి, వాటిలో ఆధునిక వసతుల కల్పన తదితర అంశాలతో మేనిఫెస్టో రూపొందించారు. కాగా 2014లో కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని షబ్బీర్‌ ఆరోపించారు.

English summary

Congress Pasrty leader Uttam Kumar Reddy Released the Manifesto of comgress party in Greater Hyderabad Municipal Corporation Elections(GHMC)