ఎపిలో ఎకనామిక్ టెర్రరిజం నడుస్తోందట 

Congress MLC C.Ramachandrayya On Agri Gold Case

03:33 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

Congress MLC C.Ramachandrayya On Agri Gold Case

ఇప్పటివరకు టెర్రరిజం అంటే ఉగ్రవాదం అనే తెల్సు . కానీ కాంగ్రెస్ నేత , ఎంఎల్సీ సి.రామచంద్రయ్య ఎకనామిక్ టెర్రరిజం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎకనామిక్ టెర్రరిజం నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఇంతకీ విషయమేమంటే, అగ్రిగోల్ద్ వ్యవహారం లో హైకోర్టు సీరియస్ అయిన నేపధ్యంలో ఆయన స్పందిస్తూ, ఈ వ్యాఖ్యలు చేసారు.

విజయవాడ కాల్ మనీ వ్యవహారంలో పెద్దలను కాపాడినట్లే , అగ్రిగోల్ద్ వ్యవహారం కూడా కనిపిస్తోందని రామచంద్రయ్య విమర్శించారు. 7 వేల కోట్ల రూపాయల బాగోతం జరిగితే , దోచుకున్న వాళ్ళపై చర్యలు లేవని , కనీసం ఒక్కరినీ కూడా అరెస్టు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు.

అగ్రిగోల్ద్ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రామచంద్రయ్య ఆరోపించారు. ఎపిలో ఎకనామిక్ టెర్రరిజం కొనసాగుతోందని ఆయన అన్నారు.

English summary

Congress MLC C.Rama Chandrayya says that Economic terrorism was there in Andhra Pradesh .He made this statements on the occasion of Agri Gold Case