రాహుల్ గాంధీ ఫ్రెండ్ కారుకి ఓ వ్యక్తి బలి

Congress MP Jyotiraditya Scindia car hits 2 wheeler

11:51 AM ON 11th August, 2016 By Mirchi Vilas

Congress MP Jyotiraditya Scindia car hits 2 wheeler

అఖిల భారత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీకి చక్కటి దోస్త్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా తాజాగా ఓ ఏక్సిడెంట్ కేసుతో వార్తాల్లోకి వచ్చారు. ఒక ప్రమాద వార్తలతో లింక్ అప్ అయ్యారు. కేరళలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన సింధియా అనుకోని విధంగా ఒక యాక్సిడెంట్ కేసులో చిక్కుకున్నారు. ఈయన కారుకి ఓ వ్యక్తి బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. కొచ్చి నుంచి చేర్తలకు ప్రయాణిస్తున్న సింధియా కారు, కొచ్చి - అలప్పుజ హైవే మీద ఒక టూవీలర్ ను ఢీ కొట్టింది. దీంతో.. టూవీలర్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మరణించారు.

అయితే, యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారును జ్యోతిరాదిత్య డ్రైవ్ చేయటం లేదు. ఆయన డ్రైవర్ కారు నడుపుతున్నాడు. జరిగిన ప్రమాదంపై ట్వీట్ చేసిన జ్యోతిరాదిత్య, చాలా దురదృష్టకర ఘటన చోటు చేసుకుందని, ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి పంపే ఏర్పాట్లు చేశామని, అయితే అతను మరణించారని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని కలుసుకునేందుకు తాను వెళుతున్నట్లుగా ట్వీట్ లో వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును పోలీసులకు అప్పగించిన సింధియా మరో కారులో బాధితుడి ఇంటికి బయలుదేరారు. ప్రమాదం జరిగిన కారులో సింధియాతో పాటు మరో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత తన దారిన తాను పోకుండా, బాధితుల ఇంటికి వెళ్లి, వారిని పరామర్శించి రావడం గ్రేటే మరి అంటున్నారు నెటిజన్లు.

English summary

Congress MP Jyotiraditya Scindia car hits 2 wheeler