మెగాస్టార్ పై కంప్లైంట్?

Congress Party Complaint On Chiranjeevi

11:30 AM ON 26th February, 2016 By Mirchi Vilas

Congress Party Complaint On Chiranjeevi

అవునా,ఇంతకీ అందరి వాడు అయిన మెగాస్టార్ చిరంజీవి ఏం చేసాడని కంపైంట్? పైగా ఓ పక్క చిన్న కూతురు పెళ్లి సందడిలో హడావిడిగా వుండగా, మరో పక్క 150 సినిమా కోసం కసరత్తు సాగుతుండగా, కొత్తగా ఈ గొడవేంటి అంటే, కాంగ్రెస్ పార్టీ వ్యవహారంలోనట. తమ్ముడు జనసేన పార్టీ కి సారధ్య బాధ్యతలు చేపడతాడని, కాదు బిజెపి గూటికి చేరిపోతున్నాడని వార్తలు వస్తే , వెంటనే ఖండిస్తూ, తాను రాజకీయాల్లో వున్నంతకాలం కాంగ్రెస్ తోనే ఉంటానని స్పష్టం కూడా చేసాడు కదా... మరి ఇంకెందుకు అంటారా?.... మరి అదే కిటుకు..... మరి వివరాల్లోకి వెళ్ళాల్సిందే.

ఇటీవల తాను దత్తత తీసుకున్న సొంతూరు మొగల్తూరు మండలంలో చిరు సుడిగాలి పర్యటిన చేసి వెళ్ళారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సభలో మాట్లాడారు. అంతా బానే వుంది. అసలు గొడవ అంతా ఇక్కడే మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి చిరంజీవి పర్యటన చేస్తున్నప్పుడు కనీసం కాంగ్రెస్ కేడర్ కి చెప్పాలి కదా. పోనీ చెప్పలేదు సరే, అలాంటప్పుడు ఎగస్పార్టీ వాళ్లకు చెప్పడం ఏమిటి అంటూ కాంగ్రెస్ వాళ్ళు రంకెలు వేస్తున్నారట. కాంగ్రెస్ తరపున కేంద్ర మంత్రి అయి , ఇప్పుడు ఇంకా రాజ్యసభ సభ్యుడుగానే వున్న చిరంజీవి ఇలా కాంగ్రెస్ ని విస్మరిస్తే ఎలా అంటూ కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు ప్రజారాజ్యం లో పనిచేసి , ఇప్పుడు వైస్సార్ సిపి జిల్లా అధ్యక్షుడుగా వున్న కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నీ తానై ఏర్పాట్లు చేస్తే , ఇంకా కాంగ్రెస్ శ్రేణులు ఎలా జీర్ణించుకుంటాయి. అందుకే 'మాకు సమాచారం ఇవ్వకుండా, ఆయన రావడం ఏమిటీ, కాంగ్రెస్ వారికి మినహాయించి, ఇతర పార్టీల నేతలను కలుపుకుని, అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఏమిటి? అంటూ కాంగ్రెస్ వాళ్ళు తీవ్రంగా మదనపడ్డారట. కొంత మంది కాంగ్రెస్ వాదులు ఒకడుగు ముందుకు వేసి, నరసాపురంలో ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి, మరీ చిరు వైఖరిని ఖండిస్తూ, ' చిరంజీవి పర్యటనకు కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేము దూరంగా ఉన్నామనీ....ఆయన వస్తున్నట్లు మాకు అసలు సమాచారమే ఇవ్వలేదనీ..దీనిపై హై కమాండ్ కంప్లైంట్ ఇస్తామని' ప్రకటించారు. మరి చిరంజీవి పై కంపైంట్ ఇస్తే పార్టీ అధిష్టానం పట్టించు కుంటుందా? పార్టీ అసలే ఇబ్బందుల్లో వుంటే ఇక చిరు మీద ఏం చర్యలు తీసు కుంటుందని మరో ప్రశ్న తలెత్తుతోంది. పార్టీ వదిలి పోవడానికి చిరంజీవి ఇలా వ్యవహరిస్తున్నారా అనే అనుమానం కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కిం కర్తవ్యమ్ ...

English summary

Recently Congress Party Leader Mega Star Chiranjeevi Visited Perupalem Village which he was adopted.Before visiting that village he does not inform to local congress party leaders and congress party leaders to complain to high command on this issue.