అబ్బో కాంగ్రెస్ 'మట్టి సత్యాగ్రహం'

Congress To Start  “Matti Satyagraham ” In A.P

06:26 PM ON 7th November, 2015 By Mirchi Vilas

Congress To Start  “Matti Satyagraham ” In A.P

స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో కీలక ఘట్టంగా నిలిచిన ఉప్పు సత్యాగ్రహం తరహాలో కాంగ్రెస్ ఇప్పుడు 'మట్టి సత్యాగ్రహం ' చేపట్టాలని నిర్ణయించింది. ఎపికి ప్రత్యేక హొదా ఇస్తారని ఎదురుచూస్తే , కొంచం మట్టి , కొంచె నీరు తెచ్చి , ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలను మోసం చేసారని , హొదా అడగాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నైరాశ్యంలో వుందని అందుచేత మట్టి సత్యాగ్రహం చేపట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహం. ఈనెల 9వ తేదీ నుంచి నెలాఖరు వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మట్టి సేకరించి , ఢిల్లికి పంపిస్తారు. అన్ని గ్రామాలు , పట్టణాలు , నగరాల నుంచి ఒక ఉద్యమంలా మట్టి సేకరించే బృహత్తర కార్యక్రమాన్ని పిసిసి నేత ఎన్ రఘువీరా రెడ్డి ప్రకటించారు. అంతే కాదండోయ్ దేశంలో పెచ్చు మీరుతున్న అసహనం పై కూడా ఓ కార్యక్రమాన్ని తలపెట్టింది. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని , దేశంలో ప్రజలు శాంతి సహజీవనం తో జీవించాలని ఆకాంక్షిస్తూ వివిధ మత పెద్దలతో ప్రవచనాలు చెప్పిస్తారట. పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాలను చేపట్టడానికి సమాయత్త మవుతున్నారు . ప్రత్యేక హొదా అంశాన్ని బిల్లులో పెట్టకుండా ,ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేసి , ఇప్పుడు సత్యాగ్రహ డ్రామాలు ఆడడం శోచనీయమని టిడిపి శ్రేణుల వ్యాఖ్య . ఏ అంశం మీద దెబ్బతిన్నామో అదే అంశాన్ని అడ్డుపెట్టుకుని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలన్నది కాంగ్రెస్ వ్యూహమా ? మరి ప్రజా మద్దతు ఉంటుందా ? కాంగ్రెస్ వాళ్ళు ఎంతవరకు సఫల మవుతారూ ? అనేది తేలాల్సి వుంది .

English summary

Congress To Start  “Matti Satyagraham ” In A.P