అబ్బో ...  2019లో కాంగ్రెస్ కి 95 సీట్లట

Congress Will Win 95 in Seats 2019 Elections says komatireddy brothers

05:57 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Congress Will Win 95 in Seats  2019 Elections says komatireddy brothers

ఎంఎల్సి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపొతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని సవాల్ విసిరి మరీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ని గెలిపించడం ద్వారా ఆమధ్య టిఆర్ఎస్ జోరులోనూ తన సత్తా చాటిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ కి మంచి భవిష్యత్తు ఉంటుందని గట్టిగా నమ్మేస్తున్నారు. రాజకీయ వ్యూహాల్లో చురుగ్గా వ్యవహరించే నల్గొండ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు గురించీ తెలిసిందే. అందుకే కోమటిరెడ్డి కుటుంబం నడిపించే రాజకీయాల్లో వెంకటరెడ్డిదే ప్రధాన భూమిక. . ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా అవసరమైన పనులు చేయించుకోవడంలో ఆయన తెలివితేటలు అమోఘం. అలాంటి కోమటిరెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను మళ్లీ బతికించడానికి ఏదో పెద్ద ప్లానే గీస్తున్నారట. అందుకే 2019 ఎన్నికల్లో ఏకంగా 95 స్థానాలను గెలుచుకుంటామని ఆయన గట్టిగా చెప్పేస్తున్నారు. ఏ లెక్కన ఆయన చెబుతున్నారో గానీ ప్రస్తుతానికి ఈ సంగతి మాత్రం అప్పుడే బయటపెట్టొద్దని కూడా ఆయనే కోరుతున్నారు. సీఎం కేసీఆర్ తో కొన్ని పనులున్నాయని... అవి అయిపోయిన తరువాత టీవీల్లో వేసుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి రీసెంటుగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సూచించారట. ప్రస్తుతానికి రెస్టులో ఉన్నామని 2018 నుంచి మళ్లీ యాక్టివ్ గా పనిచేస్తూ, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 95 సీట్లు గెలుచుకునేలా చేస్తామని ఆయన అంటున్నారు. అయితే... సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కేసీఆర్ ను కలవడానికి వెళ్తున్నానని... ఆ పని పూర్తయ్యాకే ఈ 95 సీట్ల విషయంలో టీవీల్లో వేయాలని ఆయన అన్నారట. ఈలోగా వేస్తే కేసీఆర్ తనకు పనిచేయరని కూడా కోమటిరెడ్డి ఆనారట. ఈ సందర్భంగా పలు అంశాలను కూడా ఆయన ప్రస్తావించారట. ఓ పక్క టిఆర్ఎస్ పెద్దలను కలుస్తూ, అవసరమైన పనులు చేయించుకుంటూనే, మరోపక్క కాంగ్రెస్ కి పూర్వ వైభవం తేవాలని చూస్తున్న కోమటిరెడ్డి కల ఫలిస్తుందో లేదో అప్పుడే ఎలా చెప్పగలం.

English summary

Telangana Congress Party leader Ex-Minister Komatireddy Venkata Reddy says that Congress party will win 95 seats in 2019 Elections in Telangana.