లైవ్ లో మహిళా రిపోర్టర్ ను చాచిపెట్టి కొట్టిన కానిస్టేబుల్.. ఆపై..(వీడియో)

Conistable slaps a lady reporter in live

12:30 PM ON 22nd October, 2016 By Mirchi Vilas

Conistable slaps a lady reporter in live

కారణం ఏమిటో తెలీదు గానీ, మహిళా రిపోర్టర్ అని కూడా చూడకుండా అందరూ చూస్తుండగానే పోలీస్ కానిస్టేబుల్ చాచి లెంపకాయ కొట్టి, ఆపై కాల్పులు జరిపింది. పాకిస్తాన్ లో జరిగిన ఈ ఉదంతం షాకింగ్ కి గురిచేసింది. పరస్పరం కేసులు పెట్టుకోవడంతో నమోదు చేసారు. వివరాల్లోకి వెళ్తే.. నేషనల్ సెక్యూరిటీ అథారిటీ ఫర్ డాటాబేస్ రిజిస్ట్రేషన్(నాద్రా) కార్యాలయంలో కవరేజ్ కోసం ఫోటోగ్రాఫర్ తో సహా కె-21 ఛానెల్ రిపోర్టర్ వెళ్లింది. కార్యాలయానికి వచ్చిన పబ్లిక్ పట్ల అక్కడి ఫ్రాంటియర్ కాప్స్ కానిస్టేబుల్ దురుసు ప్రవర్తనను ఆమె నిలదీసింది. దాంతో మహిళా రిపోర్టర్ అని కూడా చూడకుండా వేలుచూపించి బెధిరించడంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది.

నీకు చెల్లీ తల్లీ లేరా? జనంతో అనుచితంగా ప్రవర్తించడానికి సిగ్గు అనిపించడం లేదా అంటూ నిలదీయడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగిన కానిస్టేబుల్ ఆమెను చాచిపెట్టి లెంపకాయ కొట్టాడు. అక్కడి జనాన్ని భయభ్రాంతులను చేస్తూ గాలిలోకి కాల్పులు జరిపాడు. రిపోర్టర్ ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న గార్డును అడ్డుకోవడంతో పాటు అతని యూనిఫాంను చింపేసిందంటూ నాద్రా అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు రిపోర్టర్ పై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

English summary

Conistable slaps a lady reporter in live