అలా చేస్తే, రేప్ కిందికి రాదన్న కోర్టు !!

Consensual Sex Does Not Equal To Rape

09:54 AM ON 11th March, 2016 By Mirchi Vilas

Consensual Sex Does Not Equal To Rape

ఈ రోజుల్లో సాధారణంగా ఒక అబ్బాయి.. అమ్మాయి స్నేహంతోనో.. ప్రేమతో దగ్గర కావటం.. డేటింగ్ కి కూడా సై అనడం, ఇక శారీరక సంబంధంగా మారటం మామూలైంది. ఆ మోజులో వున్నప్పుడు ఎవరు ఏమి చెప్పినా వినిపించదు. అయితే వ్యవహారం బెడిసి కొడితే, అతగాడి పై సదరు అమ్మాయి రేప్, ఛీటింగ్ ఆరోపణలు గుప్పించే పరిస్థితులు కూడా చూస్తున్నవే. అయితే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, పరిష్కారం ఏమిటన్న దానికి బొంబాయి హైకోర్టు తాజాగా వెలువరించిన ఆసక్తికర నిర్ణయం సరిగ్గా సరిపోతుంది, వివరాల్లోకి వెళితే, షోలాపూర్ కి చెందిన ఒక యువకుడు ఓ యువతితో కొంతకాలం సంబంధం బానే కలిపాడు. అయితే ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఇక ఆ యువకుడి పై సదరు అమ్మాయి రేప్.. మోసం.. తదితర కేసులు పెట్టడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బొంబాయి హైకోర్టులో హాజరుపర్చారు.

ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి స్పందిస్తూ, తన భాగస్వామితో శారీరక సంబంధాన్ని పెట్టుకోవటం కారణంగా తలెత్తే పరిణామాల్ని ఒక విద్యావంతురాలైన మహిళకు పూర్తి అవగాహన ఉంటుందని, అందుచేత అలాంటి కేసులు అత్యాచారం పరిధిలోకి రావని తేల్చి చెప్పడమే కాదు. సదరు యువకుడికి బెయిల్ కూడా మంజూరు చేసేసారు. మరోవైపు.. ఆరోపణలు చేసిన యువతి వాదన ఏమిటంటే.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. గర్భవతి అయ్యాక మోసం చేశాడని.. అబార్షన్ చేయించిన తర్వాత నుంచి తనను విడిచి పెట్టినట్లుగా చెబుతోంది. ఈ కేసులో ప్రస్తుతానికి సదరు యువకుడికి బెయిల్ ఇచ్చారు.

English summary

Bombay High Court said that Consensual Sex Does Not Equal To Rape.Bombay high court has said that if a woman willingly has sexual relationship with a man than it was not considered as Rape