మైనర్ అనుమతితో  సెక్స్ చేసినా శిక్ష తప్పదట

Consensual sex with girl below 16 is also rape Says Punjab High Court

10:21 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Consensual sex with girl below 16 is also rape Says Punjab High Court

పరస్పర ఆమోదంతో స్త్రీ పురుషులు శృంగారంలో పాల్గొంటే నేరం కాదన్నది మేజర్ల విషయంలో ఓకే. కానీ.. మైనర్ల విషయంలో మాత్రం అలాంటిది నేరమే. గతంలో కోర్టులు ఈ విషయం తేల్చి చెప్పాయి. అయితే ఒక మైనర్ తన ఆమోదంతో శృంగారం జరిపితే,... ఆ తర్వాత ఆమె కానీ కేసు పెడితే కూడా అది నేరం కిందే వస్తుందట. ఈ మేరకు పంజాబ్ హైకోర్టు తాజాగా ఓ సంచలన తీర్పు వెలువరించింది. ఒక కేసుకు సంబంధించి మైనర్ ఇష్టపూర్వకంగా తాను శృంగారం జరిపినట్లుగా నిందితుడు చేసిన వాదనను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. 16 ఏళ్ల లోపు బాలిక సెక్స్ కు ఓకే చెప్పిందంటూ ఆమెను లోబర్చుకోవద్దని ధర్మాసనం హెచ్చరించింది.16 ఏళ్ల యువతితో సెక్స్ లో పాల్గొన్న భాగస్వామి క్రిమినల్ అవుతారని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఇద్దరు పరస్పర అనుమతితో సెక్స్ చేసినా.. తర్వాత కానీ సదరు బాలిక కేసు పెడితే అది రేప్ కిందకు వస్తుందని స్పష్టం చేసేసింది.

ఇవి కూడా చదవండి : హడావుడే ‘సర్దార్’ కి శాపంగా మారిందా?

ఒక బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేసిన ఘటనకు సంబంధించి గుడ్ గావ్ జిల్లా కోర్టు ఇచ్చిన పదేళ్ల జైలుశిక్షను సవాలు చేస్తూ హైకోర్టుకు నిందితుడు అప్పీలుకు వచ్చాడు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం.. నిందితుడు పదేళ్ల శిక్షను అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుడికి ఇంతకు ముందు పెళ్లి అయి.. ఇద్దరు పిల్లల తండ్రి కూడా. 2010 జనవరిలో ఒక బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. ఈ కేసులో సదరు నిందితుడికి పదేళ్లు శిక్ష విధించారు. అయితే.. ఆ బాలిక ఆమోదంతోనే తాను సెక్స్ చేసినట్లుగా అతడు ఎంత వాదించినా, దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. తెల్సిందిగా మైనర్ బాలికలతో కమిట్ అయ్యారో ఇక జైలే గతి ...

ఇవి కూడా చదవండి :

పుట్టింగల్‌దేవి ఆలయంలో అగ్నిప్రమాదం: 106 మంది మృతి

పెళ్ళికి ముందే తల్లులైన స్టార్ హీరోయిన్లు

ఈ దేశాల్లో మన రూపాయి చాలా రిచ్

English summary

Punjab High Court Says that if a Man participates in Sex with the minor girl's permission was also considered as rape. This was said by Punjab high Court.