దాచుకోలేని రాధికాఆప్టే

Controversies about Radhika apte

12:45 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Controversies about Radhika apte

ఎవరైనా వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచుతారు. కాని రాధికా ఆప్టే ఆ కోవకు చెందిన వారు కాదట. వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచడం ఆమెకు ఏ మాత్రం నచ్చదట. అందుకే ఆమె లైఫ్‌లో జరిగిన ప్రతీ విషయాన్ని అందరికీ చెప్పి వివాదాల్లో చిక్కుకుంటుందట. 'లెజెండ్‌' చిత్రం విజయవంతం కావడంతో తన ప్రతిభను తెలుగు నాట చాటుకుంది ఇంతే కాకుండా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ కధానాయికగా నటిస్తుంది. నృత్యంలో శిక్షణ తీసుకోవడానికి లండన్‌ వెళ్ళినప్పుడు మ్యూజీషియన్‌ అయిన బెన్‌డిక్ట్‌ టేలర్‌తో పరిచయం ఏర్పడి పెళ్ళికి దారితీసింది. నటనకు తన వైవాహిక జీవితం అడ్డుకాదని తెలిపారు. అంతేకాక ఆమెకు అగ్ర కధానాయికగా గుర్తింపు తెచ్చుకోవాలని లేదని ఏడాదిలో సగం రోజులు తన కుటుంబంతో గడిపేలా ప్లాన్‌ చేసుకుంటానని చెప్పుకొచ్చింది ఈ భామ. ఇప్పుడు రాధికా ఆప్టే రజనీకాంత్‌ సరసన కధానాయికగా 'కబాలి' సినిమాలో నటిస్తుంది.

English summary

Controversies about Radhika apte.