కొట్లాటకు దారి తీసిన లైవ్ షో...

Controversy in live show

12:10 PM ON 7th October, 2016 By Mirchi Vilas

Controversy in live show

పాక్ పై సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన ఆర్మీ చర్యలను శంకిస్తూ, ఆధారాలు చూపాలని వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో ఓ ఛానెల్ లో చర్చా ఘోష్టి నిర్వహించింది. సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ, సిపిఐ నేత డాక్టర్ నారాయణ, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. చర్చ సమయంలో కమ్యూనిస్ట్ లను ఏకి పారేసాడు. పోసాని కృష్ణ మురళీకి పదేపదే హనుమంతరావు అడ్డుతగలడంతో పోసానికి కోపం తన్నుకొచ్చింది. నేను మాట్లాడితే మీరు మౌనంగా ఉండాలి, మీరు మాట్లాడితే నేను వింటా. నేను పిచ్చి కుక్కను కాదు.

చదువుకుని వచ్చా. నాకు మోడీ ఇష్టం నేను పొగుడుతాను అన్నాడు. నీ ఇష్టం బయట చూసుకో అని హనుమంతరావు అనడం, ఈ దశలో మాటా మాటా పెరిగింది. చూసుకుందామా అనేదాకా వెళ్ళింది. హనుమంతరావు సీటులోంచి లేవడంతో, ఆయనపై పోసాని దూసుకెళ్లాడు. అంతే అందరూ అవాక్కయ్యారు. తక్షణం లైవ్ ఆగిపోయింది.

English summary

Controversy in live show