ఫింగర్ ప్రింట్ స్కానర్ తో కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ 

Coolpad Note 3 Lite With Finger Print Sensor

12:22 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Coolpad Note 3 Lite With Finger Print Sensor

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ కూల్‌ప్యాడ్ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దాదాపు కూల్‌ప్యాడ్ నోట్ 3 ఫీచర్లు ఉన్న కూల్ ప్యా్ నోట్ 3లైట్ పేరిట కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. ఫింగర్ ప్రింట్ స్కానర్, 3జీబీ ర్యామ్ ఉన్న ఈ ఫోన్ ధర కేవలం రూ.6,999 మాత్రమ. అమెజాన్ సైట్ ద్వారా ఫ్లాష్‌సేల్‌లో ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. ఈ నెల 28వ తేదీన మొదటి సేల్ జరగనుండగా ఇందుకు రిజిస్ట్రేషన్లను ఇప్పటికే ప్రారంభించారు.

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ ఫీచర్లు...

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4జీ, బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

Coolpad note 3 lite smart was launched with finger print sensor and the price of this smart phone was Rs. 10,000.The main features of this smartphone was 5-inch HD IPS display,13-megapixel camera, LED flash,5-megapixel front camera,3GB of RAM and 16GB of storage