21 సెకన్లు.. 30 వేల ఫోన్లు

Coolpad Sells 30,000 units sold in 21 seconds

10:25 AM ON 29th January, 2016 By Mirchi Vilas

Coolpad Sells 30,000 units sold in 21 seconds

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కూల్ ప్యాడ్ విక్రయానికి పెట్టిన నోట్ 3 లైట్ ఫోన్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. అమెజాన్ లో 21 సెకన్లలో 30 వేల ఫోన్లు అమ్ముడయ్యాయని కూల్ ప్యాడ్ తెలిపింది. ఫస్ట్ ఫ్టాష్ సేల్ లో కూల్ ప్యాడ్ నోట్ 3కి అద్భుత స్పందన లభించిందని, 21 సెకన్లలో 30 వేల ఫోన్లు విక్రయించామని, టెక్నాలజీని అందరికీ చేరువ చేయాలన్న తమ ప్రయత్నానికి మద్దతు లభించిందని కూల్ ప్యాడ్ ఇండియా సీఈవో సయిద్ తజూద్దీన్ అన్నారు. ఫిబ్రవరి 4న మరోసారి ఫ్లాష్ సేల్ పెడతామని తెలిపారు. కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్ ధర రూ.6.999. కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్ ఫీచర్లు ఏమిటంటే.. 3 జీబీ ర్యామ్, 5.0 హైడెఫినేషన్ డిస్ ప్లే, 16 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ, 13 ఎంపీ కెమెరా, 2,500 ఏఎంపీ బ్యాటరీ, 4జీ మొదలైనవి.

English summary

Chinese mobile company Coolpad recently launched it s new smartphone named Coolpad Note 3 Lite with the stunning features like 16GB internal storage,finger print scanner,13 mega pixel camera with the price od 6,999.On flash sale this 30,000 smartphone s were sold within 22 seconds and creates record in smartphone sales