ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించిన యువతికి పూల బొకే

Cop sends flowers to crying woman

03:19 PM ON 13th November, 2015 By Mirchi Vilas

Cop sends flowers to crying woman

ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా అతివేగంగా నడుపుతున్న ఒక యువతికి ట్రాఫిక్‌ పోలీసు అధికారి పూల బొకే అందించిన సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకపోతే మందలించాలి కానీ పూల బొకే ఇవ్వడమేంటీ చోద్యం అనుకుంటున్నారా...కానే కాదు..నిజానికి కటోటో అనే యువతి 30కి.మీ వేగంతో వెళ్ళాల్సిన రోడ్డుపై అంతకుమించిన వేగంతో వాహనాన్ని నడపడంతో ఒక పోలీసు అధికారి ఆమెను నిలిపివేసి మందలించాడు. దానికి ఆ యువతి ఏడుపు లంకించుకోవడంతో కరిగి పోయిన ఆ పోలీసు అధికారి పూల బొకే ఇచ్చి ఆమెను సముదాయించాడు. వేగంగా వాహనాన్ని నడపడం నేరమని ఆమెకు చెప్పబోయాడు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే తాను వేగంగా నడపాల్సి వచ్చిందని తర్వాత ఆ యువతి వివరణ ఇచ్చుకుంది. దీంతో ఆ పోలీసాఫీసర్‌ ఆమెకు తన తల్లిపట్ల ఉన్న ప్రేమకు పొంగిపోయాడట.

English summary

Cop sends flowers to crying woman she stopped for speeding