అన్ని సమస్యలకు ఒకే ఒక్క ఔషధం !!

Coriander benefits

06:27 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Coriander benefits

ఈజిప్టు ఫారో టుటంఖమేన్‌ సమాధి లో పురావస్తు శాఖవారు 5,000 బిసి కాలంలో కొత్తిమీరని కనుగొన్నారు. ఇది ఒక పురాతన ఔషధం. కొత్తిమీర కూడా చరిత్రలో భాగమే. పురాతన కాలంలో ఔషధాలలో దీనిని అధికంగా ఉపయోగించే వారు. కొత్తిమీర ధనియాల నుండి వస్తుంది. అప్పట్లోనే వీటిని ఉపయోగించి చికెన్‌ ఫాక్స్‌ ని తరిమికొట్టారు.

  • ఐరోపాలో కొత్తిమీర యాంటీ డయాబెటిక్‌ మొక్కగా పేరుగాంచింది.
  • భారతదేశంలో కొత్తిమీరను శోధనిరోధన లక్షణాల కోసం వాడుతున్నారు.
  • అమెరికాలో కొత్తిమీరను కొలస్ట్రాల్‌ తగ్గించుకునేందుకు ఉపయోగిస్తున్నారు.

శరీరానికి కావలసిన ఖనిజాలను అందిస్తుంది :

ప్రజాదరణ పొందిన కొత్తిమీర ను వైద్య పితామహ అని కూడా అంటారు. దీనిలో చాలా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అందువల్ల చికెన్‌ఫాక్స్‌, డయేరియా, నోటిపూత, రక్తహీనత, అజీర్ణం, ఋతు లోపాలు, కండ్ల కలక, చర్మ లోపాలు, రక్తంలో చక్కెర రుగ్మతలు, తెగులు వ్యాధి, అతిసారం వీటితో పాటుగా బోలు ఎముకల వ్యాధి, కీళ్ళవాతం, తలనొప్పి, కండరాల నొప్పి తదితర వ్యాధులను అరికట్టడం లో అద్బుతంగా పనిచేస్తుంది.

కొత్తిమీరలో చాలా ఖనిజవనరులు ఉన్నాయి. ఇది కాలేయానికి చాలా మంచి ఔషధం. దీనిలో అధిక మోతాదులో ఫోటో న్యూట్రియంట్స్‌ మరియు ప్లేవనాయిడ్స్‌ లభించే అమోఘమైన వనరు. కొత్తిమీర లో చాలా ఖనిజాలు ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, మాంగనీసు, ఇనుము మరియు మెగ్నిషియం అంతేకాకుండా విటమిన్లు-ఫోలిక్‌ ఆమ్లం, రిబోప్లావిన్‌, నియాసిన్‌, విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌, విటమిన్‌ సి ఉన్నాయి. వీటన్నింటిని తో పాటు విటమిన్‌ ఎ మరియు విటమిన్‌ కె సమృద్దిగా ఉన్నాయి. ఇన్ని రకాల విటమిన్లు, మినరల్స్‌ ఉండడం వలన ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో ఆహారంతో పాటు సేవించడం వలన ఆరోగ్యవంతంగా ఉంటారు.

ధనియాల నూనె :

విటమిన్‌ డి శరీరానికి చాలా అవసరం. విటమిన్‌ డి ఉత్పత్తికి విటమిన్‌ కె తోడ్పడుతుంది. దీని తయారికీ ఆరోగ్యవంతమైన కొలస్ట్రాల్‌ ఎంతో అవసరం. ఇది సూర్యరశ్మి తాకిడి వలన శరీరంలో డి విటమిన్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ డి విటమిన్‌ కావలసిన బలాన్ని చేకూరుస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుంది. విటమిన్‌ డి ఒంటరిగా రోగనిరోధక శక్తిని అందిస్తుంది. కాని ఇది మధుమేహం, దీర్ఘకాల వ్యాధి, గుండె జబ్బులు, క్యాన్సర్‌ జీర్ణవ్యవస్థ సమస్యలను ఒంటరిగా ఎదుర్కొనలేదు. కాని విటమిన్‌ డి, సూర్యరశ్మి ధనియాలు, కొత్తిమీరల సహాయంలో ఈ వ్యాధులను నివారించవచ్చు.

ఈ నూనె వలన కలిగే ప్రయోజనాలు :

1. రోగనిరోధక శక్తి

కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్‌, పైటోన్యూట్రియంట్స్‌, మినరల్స్‌ మరియు విటమిన్లు అధికమోతాదులో ఉండడం వలన ఇది శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

2. డయాబెటిస్‌

2009 లో ప్రపంచవ్యాప్తంగా 285 మిలియన్ల ప్రజలు డయాబెటిస్‌ భారిన పడ్డారు. నేడు 365 మిలియన్ల ప్రజలు ఈ మధుమేహం సమస్యతో సతమతమౌతున్నారు. ధనియాల నూనెని వాడడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి క్రమబద్దం చేస్తుంది.

3. జీర్ణక్రియ

కొత్తిమీర జీర్ణక్రియ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీనిలోని శక్తివంతమైన యాంటీ ఫంగల్‌ లక్షణాల కారణంగా ఇది కడుపులోని మలినాలను శుభ్రం చేసి జీర్ణక్రియ కు దోహదపడుతుంది.

4. క్యాన్సర్‌

కొత్తిమీర మరియు ధనియాల నూనె క్యాన్సర్‌ చికిత్సకు ఉపయోగపడుతాయి. కొత్తిమీర కాలేయానికి, రొమ్ము మరియు పెద్దప్రేగుకి చాలామంచిది. అంతేకాకుండా ఇది క్యాన్సర్‌ ని నిరోధించడంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

5. గుండె సమస్యలు

కొత్తిమీర మరియు ధనియాల నూనెని రోజూ ఆహారంలో తీసుకోవడం వలన రక్తపోటుతో బాధపడుతున్న రోగుల్లో మంచి మార్పుని గుర్తించగలరు. అంతేకాకుండా ఇది గుండెపోట్లు మరియు స్ట్రోకులకు దూరంగా ఉంచి గుండెని ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

English summary

Coriander is a powerful herb with many health benefits. Discovered by archaeologists is Egyptian pharaoh tutankhamen’s tomb.