తాను సంపాదించిన 14వేల కోట్లు పంచేసాడు.. ఒక్కో కుటుంబానికి ఎంతొచ్చిందో తెలుసా?

Corona beer founder Antonino Fernandez makes every resident

11:58 AM ON 2nd December, 2016 By Mirchi Vilas

Corona beer founder Antonino Fernandez makes every resident

పక్కవాడు కష్టాల్లో ఉంటే ఒక్కరూపాయి సాయం చేయడానికి ఒకటికి పదిసార్లు లెక్కించే ఈ రోజుల్లో, అక్షరాల 14వేల కోట్ల రూపాయలను పేదలకు పంచేశారు. అవును నిజం. ఇదేదో పెద్ద నోట్ల రద్దు వలన బ్లాక్ మనీ పంచడం కాదు. అసలు మనదేశం కాదు కూడా. స్పెయిన్ కు చెందిన వ్యాపారవేత్త ఆంటోనినో ఫెర్నాండెజ్ తన ఊరి ప్రజల కోసం ఇంత మొత్తాన్ని వితరణగా పంచేశాడు. వివరాల్లోకి వెళ్తే...

1/6 Pages

1917లో స్పెయిన్ లోని సెరెజల్స్ డెల్ కొండాడొ గ్రామంలో నిరుపేద కుటుంబంలో ఆంటోనినో జన్మించాడు. అతనికి 13 మంది అక్కాచెల్లెలు ఉన్నారు. అయితే అంత పెద్ద కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి సంపాదన చాలలేదు. దీంతో ఫెర్నాండెజ్ 14 ఏళ్ల వయస్సులో చదువుకు స్వస్తి చెప్పి కుటుంబ పోషణ భారాన్ని నెత్తిన వేసుకున్నాడు.

English summary

Corona beer founder Antonino Fernandez makes every resident