గణపతి లడ్డూ పాటల్లో ధరలు ఎంతో తెలుసా?

Cost of Ganesha Laddu's

05:11 PM ON 16th September, 2016 By Mirchi Vilas

Cost of Ganesha Laddu's

గణపతి నవరాత్రులు పెట్టింది పేరు భాగ్యనగరం. ఏటా ఇక్కడ జరిగే ఉత్సవాలు వర్ణనాతీతం. అందునా ఖైరతాబాద్ మహా గణపతి అంటే చెప్పనవసరం లేదు. గత కొన్నేళ్లుగా లడ్డూలు కూడా ఏర్పాటుచేసి, పాటలు పెడుతుంటే, భారీగానే ధర పలుకుతోంది. ఇంచుమించు అన్నిచోట్లా లడ్డూలు పెడుతున్నా, కొన్ని ముఖ్య ప్రాంతాల్లో లడ్డూ పాటలు ఆసక్తి రేకెత్తిస్తాయి. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథులు గురువారం నిమజ్జనానికి తరలి వెళ్లిన సందర్భంగా పలు ప్రాంతాల్లోని మండపాల్లో వినాయకుడి వద్ద ఉంచి లడ్డూలకు వేలంపాట నిర్వహించారు. ఈ లడ్డూలను పలువురు భక్తులు రూ.లక్షల్లో పాడుకుని సొంతం చేసుకున్నారు.

1. బాలాపూర్ గణేశ్ లడ్డూ 14.65 లక్షలు

2. ఎస్ఆర్ నగర్ లోని మధురానగర్ లో రూ.9.99 లక్షలు

3. సరూర్ నగర్ పరిధిలోని బడంగ్ పేటలో రూ.5.41 లక్షలు

4. హయత్ నగర్ వినాయకనగర్ లో 4.37 లక్షలు

5. వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ లో రూ.3.35 లక్షలు

6. మూసాపేట్ సేవాలాల్ నగర్ లో రూ.3.12 లక్షలు

7. కేపీహెచ్బీ కాలనీ మూడో ఫేజ్ లో 2.11 లక్షలు

1/1 Pages

English summary

Cost of Ganesha Laddu's